1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Vikarabad Student dies in Australia, family seeks help

ఆస్ట్రేలియాలో తెలంగాణ యువకుడు మృతి?

Vikarabad Student
ఆస్ట్రేలియాలో ఓ తెలంగాణ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. బాత్రూమ్‌లో జారిపడటంతో బ్రెయిన్ డెడ్ అయ్యాడు. మృతుని పేరు శివశంకర్ రెడ్డి. వసయు 25 యేళ్లు. వికారాబాద్ జిల్లా ధారూర్ మండలం హరిదాస్‌పల్లి వాసి. 
 
హైదరాబాద్‌లో బీటెక్ పూర్తిచేసిన అనంతరం ఉన్నత చదువుల కోసం 2018లో ఆస్ట్రేలియా వెళ్లాడు. సౌత్రన్ క్రాస్ యూనివర్సిటీలో పీజీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 15న స్నానాల గదిలోకి వెళ్లిన శివశంకర్‌రెడ్డి జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు.
 
స్నేహితులు వెంటనే అతడిని ఆసుపత్రిలో చేర్పించారు. పరీక్షించిన వైద్యులు మెదడులో నరాలు చిట్లిపోయినట్టు చెప్పారు. ఐదు రోజుల క్రితం బ్రెయిన్‌డెడ్ అయిన శివశంకర్‌రెడ్డి పరిస్థితి విషమించడంతో సోమవారం మృతి చెందాడు. అతడి మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు సహకరించాలంటూ ఆస్ట్రేలియాలోని ప్రవాస భారతీయులు మంత్రి కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు.
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
వన్ ప్లస్ 8టి మొబైల్ ఎప్పుడొస్తుందంటే?