సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 22 సెప్టెంబరు 2020 (11:02 IST)

ఇక కరోనా టెస్టులు రోబోలే తీస్తాయి.. సింగపూర్ వినూత్న ప్రయత్నం

కరోనా వైరస్‌ను ఎదుర్కొనే దిశగా సింగపూర్ సర్కారు ఓ వినూత్న ప్రయత్నం చేసింది. కరోనా పరీక్షల్లో ఆరోగ్య సిబ్బందిని పరిమితంగా వినియోగించడంతో పాటు ఇలాంటి క్లిష్ట సమయంలో వారి కొరతను అధిగమించే లక్ష్యంతో ప్రత్యేక రోబోను అభివృద్ధి చేసింది.

ఇకపై 'స్వాబోట్‌' తోనే స్వాబ్‌ టెస్ట్‌లు నిర్వహించనున్నారు. నేషనల్‌ క్యాన్సర్‌ సెంటర్‌ సింగపూర్‌ , సింగపూర్‌ జనరల్‌ ఆస్పత్రి వైద్యులు మెడికల్‌ రొబొటిక్స్‌ టెక్నాలజీ కలిగిన బయోబోట్‌ సర్జికల్‌ సంస్థ భాగస్వామ్యంతో 'స్వాబోట్‌'ను రూపొంచారు.
 
శిక్షణ కలిగిన తమ దేశ ఆరోగ్య సిబ్బందికి కోవిడ్‌ ముప్పు లేకుండా.. కరోనా టెస్టుల్లో వారి సేవల్ని పరిమితం చేసేలా ఈ రోబోలను అభివృద్ధి చేశారు.

రోగుల ముక్కు నుంచి ఆటోమేటిక్‌గా ఈ రోబోలే స్వాబ్‌ తీస్తాయని ఆ సంస్థలు తెలిపాయి. ఈ స్వాబోట్‌ స్వీయ నిర్వహణ కలిగి ఉంటుందని, రోగులు దీన్ని తమ ఇష్టప్రకారం వినియోగించుకొనే అవకాశం ఉన్నట్టు తెలిపింది.