మంగళవారం, 26 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 7 అక్టోబరు 2020 (19:27 IST)

ఐరెన్ లెగ్ ముద్రను 'గబ్బర్ సింగ్' చెరిపేసింది : శృతిహాసన్ (video)

తన సినీ కెరీర్ ఆరంభంలో ఐరెన్ లెగ్ అనే ముద్రపడిందనీ, దీన్ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ చిత్రం చెరిపేసిందని ప్రముఖ హీరోయిన్ శృతిహాసన్ చెప్పుకొచ్చింది. పైగా, ఇటీవల తాను ఓ జాతీయ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చానని, అందులో తాను పేర్కొన్న అంశాన్ని కొన్ని తెలుగు మీడియా సంస్థలు తప్పుగా అన్వయించాయని ఆమె ఆరోపించారు. ఆ అంశంపై సదరు తెలుగు మీడియా సంస్థల నుంచి వచ్చిన కథనాలు అవాస్తవమని స్పష్టం చేశారు.
 
తెలుగు చిత్ర పరిశ్రమ అంటే తనకు ఎంతో గౌరవం ఉందని శ్రుతి హాసన్ ఉద్ఘాటించారు. అల్లు అర్జున్‌ నటించిన 'రేసుగుర్రం', పవన్ కల్యాణ్‌తో చేసిన 'గబ్బర్ సింగ్' వంటి చిత్రాల్లో భాగమైనందుకు ఎంతో గర్విస్తున్నానని వివరించారు. అలాంటి తెలుగు సినిమాలతోనే తనకు స్టార్ డమ్ వచ్చిందని శ్రుతి వెల్లడించారు.
 
అయితే ఇటీవల ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ కమర్షియల్ సినిమాల గురించి తన మనసులో మాట బయటపెట్టింది. `ఎక్కువగా కమర్షియల్ సినిమాలు చేయాలని చెప్పే వారి మాటలను ఇక వినాలనుకోవడం లేదు. నేను కొన్ని బ్లాక్‌బస్టర్ సినిమాల్లో భాగమయ్యాను. కానీ, నాకు అవి అంత సంతృప్తిని ఇవ్వలేదు. ఇప్పుడు నాకు నచ్చిన కథలను ఎంచుకోవడంలో నిజాయితీగా వ్యవహరిస్తున్నాన`ని శ్రుతి పేర్కొంది.
 
శ్రుతి వ్యాఖ్యల ఆధారంగా కొన్ని వెబ్‌సైట్లలో వార్తలు వచ్చాయి. ముఖ్యంగా `గబ్బర్‌సింగ్`, `రేసుగుర్రం` వంటి సినిమాలను శ్రుతి ఇష్టపడలేదని కథనాలు రాశాయి. దీంతో శ్రుతి తాజాగా స్పందించింది. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని ట్వీట్ చేసింది. `జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నేను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు. నా ఇంటర్వ్యూ గురించి తెలుగులో వచ్చిన ఆర్టికల్స్ పూర్తిగా అవాస్తవాలు. `గబ్బర్‌సింగ్`, `రేసుగుర్రం` వంటి సినిమాల్లో భాగమైనందుకు నేను చాలా గర్వంగా ఫీలవుతున్నా. పవన్‌కల్యాణ్‌‌తో చేసిన `గబ్బర్ సింగ్` నా జీవితాన్ని మార్చింద`ని శ్రుతి పేర్కొంది.