బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 24 సెప్టెంబరు 2020 (10:09 IST)

''ఆద్య''గా రానున్న రేణు దేశాయ్.. వెబ్‌సిరీస్‌లో నటించనున్న బద్రి హీరోయిన్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ త్వరలో వెబ్ సిరీస్‌లో నటించనున్నారు. రేణుదేశాయ్ బద్రి సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఆతర్వాత పవన్ కళ్యాణ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకోవడం తెలిసిందే. అయితే... పవన్‌తో జానీ సినిమాలో నటించిన తర్వాత మళ్లీ సినిమాల్లో నటించలేదు. దర్శకురాలిగా మారి ఇష్క్ వాలా లవ్ అనే సినిమా రూపొందించారు. 
 
ప్రస్తుతం నటిగా కెమెరా ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. దాదాపు 17 ఏళ్ల గ్యాప్ తర్వాత నటిగా కొత్త జర్నీ స్టార్ట్ చేయనున్నారు. ఓ వెబ్ సిరీస్‌లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ వెబ్ సిరీస్‌కి కృష్ణ మామిడాల దర్శకత్వం వహించనున్నారు. ఈ వెబ్ సిరీస్‌ను డీ.ఎస్.రావు, ఎస్. రజనీకాంత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 
 
సత్యాన్వేషణలో.. ఒక మహిళ ప్రయాణం ఎలా ఉంటుంది..? ఈ వెబ్ సిరీస్ స్టోరీ అని తెలిసింది. ఇందులో ఆమె ఒక సాఫ్ట్ వేర్ కంపెనీకి సీఈఓగా కనిపించనున్నారట. ఇక అసలు విషయానికి వస్తే.. ఈ వెబ్ సిరీస్ టైటిల్ ఆద్య అని టాక్ వినిపిస్తోంది. 
 
రేణు దేశాయ్, పవన్ కళ్యాణ్‌ల కుమార్తె పేరు ఆద్య. అందుకనే ఈ వెబ్ సిరీస్‌కి ఆ టైటిల్ ఖరారు చేశారట. టైటిల్ బయటకు రావడంతో అందరకీ ఈ వెబ్ సిరీస్‌పై ఆసక్తి కలుగుతుంది. త్వరలో ఈ వెబ్‌సిరీస్‌పై అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం వున్నట్లు తెలుస్తోంది.