సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 10 సెప్టెంబరు 2020 (13:36 IST)

16 యేళ్ళ ప్రాయంలో కెమెరా ముందుకొచ్చా.. విధి మరో దారిలోకి తీసుకెళ్లింది...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య, సినీ నటి, దర్శకురాలు రేణూ దేశాయ్ మరోమారు తన పాత రోజులను గుర్తుకు తెచ్చుకుంది. అంటే.. 25 యేళ్ల క్రితం తాను కెమెరా ముందుకు వచ్చిన రోజును నెమరువేసుకుంది. దీనికి కారణం.. ఆమె సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఇప్పటి 25 యేళ్లు పూర్తయ్యాయి.
 
ఈ సందర్భంగా ఆమె పాత జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకున్నారు. తన అనుభవాలను, వ్యక్తిగత అంశాలను సోషల్  మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తాను అంతరిక్ష శాస్త్రవేత్త లేదా డాక్టర్ కావాలనుకున్నానని... అయితే  విధి మాత్రం తనను మరో దారిలో తీసుకెళ్లిందని చెప్పారు.
 
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాలో చేరాలనుకున్నట్టు చెప్పింది. అయితే, అలా జరగకపోయే సరికి చాలా బాధ పడ్డానని అన్నారు. కొన్ని సంవత్సరాల పాటు తాను బాధను అనుభవించానని చెప్పారు.
 
అదేసమయంలో తాను 16 ఏళ్ల వయసులో తాను అనుకోకుండానే కెమెరా ముందుకు వచ్చానని తెలిపారు. ఆ తర్వాత సినిమాలతో ప్రేమలో పడిపోయానని చెప్పారు. సినీ రంగంలోకి అడుగు పెట్టిన తర్వాత తన జీవితంలో జరిగిన అన్ని విషయాలు మీకు తెలుసని అన్నారు. ఈ సందర్భంగా ఆమె తన పాత ఫొటోలను షేర్ చేశారు.