సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 9 జులై 2020 (16:08 IST)

నా అస్సలు పేరు అది కాదు.. ఆయన మార్చారు : రేణూ దేశాయ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్. ఈమె ఇద్దరు పిల్లల తల్లి. ఒకవైపు గృహిణిగా ఉంటూనే, మరోవైపు దర్శకురాలిగా రాణిస్తోంది. ఈమె వెండితెరకు పరిచయమైనప్పటి నుంచి రేణూ దేశాయ్‌గా సుపరిచితం. అలాగే, పవన్ కళ్యాణ్ భార్యగా ఉన్నంతకాలం ఆమె కూడా రేణూ దేశాయ్ పేరుతోనే కొనసాగారు. 
 
అయితే, తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తన అస్సలు పేరు రేణూ దేశాయ్ కాదని చెప్పారు. తన తండ్రి పెట్టిన పేరు హీరావతి అని చెప్పారు. అలాగే, తన నాన్నమ్మ పెట్టిన పేరు రేణుకా దేవి అని వివరించారు. అయితే, తన తండ్రి 2012లో మరణించిన తర్వాత తన నాన్నమ్మ రేణుకా దేవిగా మార్చారు. అయితే, తాను సినీ ఇండస్ట్రీకి పరిచయమైన తర్వాత రేణూ దేశాయ్‌గా మార్చారని ఆమె వివరించారు.