సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 21 ఏప్రియల్ 2020 (11:16 IST)

ఓయ్ పూరీ... నీ వల్లే ఓ అందమైన ఫ్యామిలీ వచ్చింది... రేణూ దేశాయ్

టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ ఏప్రిల్ 20వ తేదీతో తన 20 యేళ్ల సినీ కెరీర్‌ను పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన తన పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు. ఇలాంటి జ్ఞాపకాల్లో వెండితెరకు రేణూ దేశాయ్‌ను పరిచయమైంది. ఈమె పూరి జగన్నాథ్‌కు విషెస్ చెపుతూ తన పాత జ్ఞాపకాలను కూడా పూరితో పంచుకుంది. 
 
లైవ్ వీడియో ఇంటరాక్షన్‌లో రేణు దేశాయ్ మాట్లాడుతూ, బద్రీ సినిమాలో దర్శకుడు పూరి జగన్నాధ్ ఆఫర్ ఇచ్చినందున తాను పవన్ కళ్యాణ్‌ను కలిశానని, తద్వారా మంచి కుటుంబం లభించిందన్నారు. బద్రి సినిమాలో వెన్నెల క్యారెక్టర్ ఇచ్చినందుకు పూరి జగన్నాధ్ పట్ల ఆమె కృతజ్ఞతలు తెలిపారు. 
 
ఆ తర్వాత పూరి జగన్నాధ్ మాట్లాడుతూ ఈ చిత్రంలో సరయు పాత్ర కోసం రేణు దేశాయ్ తీసుకోవాలని వారు భావించారని, అయితే పవన్ పాత్రలను మార్చి వెన్నెలా పాత్రను రేణు దేశాయ్‌కి ఇచ్చారని చెప్పారు. అంతేకాకుండా, ఓ వృద్ధాప్య పాత్రలో నటించే అవకాశం ఇవ్వాలని ఆమె పూరిని కోరింది. పైగా, ఈ పాత్రలో ఒక్క రోజైనా నటించాలని భావిస్తోంది.