మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 1 ఏప్రియల్ 2020 (13:08 IST)

భార్యతో పూరి జగన్నాథ్‌ను కొట్టించిన చిరంజీవి ట్వీట్

మెగాస్టార్ చిరంజీవి కేవలం వెండితెరపై మాత్రమే.. సోషల్ మీడియాలోనూ సందడి చేస్తున్నారు. సోషల్ మీడియాలోకి ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. ఆయన చేస్తున్న ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. తాజాగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి చేసిన ఓ ట్వీట్ ఇపుడు కొంప ముంచింది. పూరి చెంప ఛెళ్లుమనిపించేలా చేసింది. పైగా, పూరికి ఆయన భార్యకు మధ్య పెద్ద గొడవే జరిగిందట. ఈ విషయాన్ని పూరి జగన్నాథ్ తాజాగా ఓ ట్వీట్‌ ద్వారా వెల్లడించారు. 
 
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతోంది. దీంతో చిరంజీవి సరదాగా, దర్శకుడు పూరి జగన్నాథ్‌ను ఉద్దేశించి సరదాగా ఓ ట్వీట్ చశారు. లాక్‌డౌన్ వల్ల పూరి జగన్నాథ్ బ్యాంకాక్, ముంబై బీచ్‌లను బాగా మిస్ అవుతుంటాడని చిరు ట్వీట్ చేశారు.
 
దీనిపై పూరి జగన్నాథ్ స్పందిస్తూ.. చిరంజీవి సార్ పెట్టిన ట్వీట్ తన కొంప ముంచిందన్నారు. ఇలాంటి సమయంలో బ్యాంకాక్ గురించి ఎందుకు ట్వీట్ చేశారో కానీ... మా ఆవిడ నా చెంప పగలగొట్టిందని చెప్పుకొచ్చారు. 
 
చిరంజీవి సార్ ట్వీట్ చూసి గతంలో జరిగినవన్నీ మా ఆవిడకు గుర్తుకొచ్చాయని... దాంతో తన మీద చేయి చేసుకుందని సరదాగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది.