సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Modified: మంగళవారం, 31 మార్చి 2020 (22:45 IST)

ప్రియుడితో కలిసి పదేళ్ల క్రితం పారిపోయిన భార్య, కరోనా పుణ్యమా అంటూ గ్రామంలోకి తిరిగివస్తే?

తమిళనాడు రాష్ట్రం మధురై జిల్లా ఉసిలిపట్టి సమీపంలోని ఒక వ్యక్తికి అదే ప్రాంతానికి చెందిన మరో మహిళతో 15యేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. మంచి కుటుంబమని అందరూ చెప్పుకునేవారు. వీరి జీవితం సాఫీగానే సాగిపోయేది.
 
అయితే ఆమె తన ఇంటి పక్కనే ఉన్న ఒక యుకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. రెండు నెలల పాటు ఈ తంతు సాగింది. ఎవరికీ అనుమానం రాకుండా అక్రమ సంబంధాన్ని కొనసాగించింది. అయితే అది కాస్తా బయటపడింది. ఇంట్లో ఉంటే భర్త చంపేస్తాడన్న భయంతో ప్రియుడితో కలిసి పారిపోయింది.
 
చెన్నై సిటీలో పదిసంవత్సరాల పాటు వీరు సహజీవనం చేశారు. అయితే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో ఆ యువకుడు ఆమెను వదిలేసి తన స్వగ్రామానికి వచ్చేశాడు. తాను ఒంటరిగా చెన్నైలో ఉండలేక సొంత గ్రామంలో భర్త దగ్గరకు వచ్చింది.
 
ఆ మహిళను చూసిన భర్త, అతని స్నేహితులు ఆగ్రహంతో ఊగిపోయారు. ఆమెను నిన్న రాత్రి రోడ్డుపై లాక్కుంటూ వచ్చి కర్రలతో కొట్టారు. తలపై ఆ మహిళకు తీవ్ర గాయాలు కావడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. మంగళవారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.
 
అలాగే యువకుడిని వారి తల్లిదండ్రులు దాచి ఉంచే ప్రయత్నం చేశారు. అయితే గ్రామస్తులు అతనిపైనా దాడి చేయడంతో అతనికి గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో యువకుడు చికిత్స పొందుతున్నాడు. దాడిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.