సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 9 సెప్టెంబరు 2020 (08:21 IST)

మీకు దండం నాయ‌నా.. వ‌దిన ఏంటీ.. అక్క అనండి.. పీకే ఫ్యాన్స్‌కు వేడుకోలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు సినీ నటి, బీజేపీ మహిళా నేత మాధవీలత ఓ విజ్ఞప్తి చేసింది. మీకు దండం నాయనా.. వదిన ఏంటి... అక్క అనండి అంటూ ప్రాధేయపడింది. ఇంతలా ఆమె ప్రాధేయపడటానికి కారణం లేకపోలేదు.
 
సినీ హీరో, జనసేన పార్టీ నేత పవన్ కళ్యాణ్‌ను ఆయన ఫ్యాన్స్ అంతా సోషల్ మీడియాలో అన్నా అంటూ సంబోధిస్తుంటారు. అలాగే, పీకే మాజీ భార్య రేణూ దేశాయ్‌ను కూడా వదినమ్మ అంటూ పిలుస్తుంటారు. ఇదే ఫార్ములాను కూడా మాధవీలత విషయంలోనూ పీకే ఫ్యాన్స్ అప్లై చేశారు. 
 
దీనికి కారణం లేకపోలేదు. పవన్‌‌పై మాధవీలత మనసు పారేసుకుందనీ, ఆయన సమ్మతిస్తే పెళ్లి కూడా చేసుకుంటానని ఈ అమ్మడు వ్యాఖ్యానించినట్టు సోషల్ మీడియాలో గతంలో ఓ వార్త వైరల్ అయింది. అప్పటి నుంచి మాధవీలత పట్ల పీకే ఫ్యాన్స్ విధేయత చూపిస్తూ వదిన అని పిలుస్తుంటారు. 
 
దీంతో ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. మీకు దండం నాయ‌నా. వ‌దిన ఏంటీ.. అక్క అనండి. మీకు పీకే అన్న కావొచ్చు. నేను అక్క‌నే.. అని త‌నను వ‌దిన అంటూ పిలిచిన ఓ నెటిజ‌న్‌కు ఫేస్‌బుక్‌లో స‌మాధాన‌మిచ్చింది. 
 
కాగా, ఇటీవల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా మాధవీలత బర్త్‌డే విషెస్ చెప్పారు. ఆమె చేసిన ట్వీట్‌కు పవన్ కూడా రీట్వీట్ చేసిన విషయం తెల్సిందే.