గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Modified: శనివారం, 5 సెప్టెంబరు 2020 (17:04 IST)

షాకింగ్ - పవన్ కళ్యాణ్‌ వెబ్ సిరీస్‌లో నటించనున్నారా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మూవీతో రీ-ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆచితూచి సినిమాలు చేస్తారనుకుంటే.... వరుసగా సినిమాలు ఎనౌన్స్ చేస్తూ ఫ్యాన్స్‌తో పాటు అందర్నీ సర్‌ఫ్రైజ్ చేసారు. వకీల్ సాబ్ షూటింగ్ కంప్లీట్ చేసి.. ఆ తర్వాత క్రిష్‌తో చేస్తున్న మూవీ షూటింగ్‌లో పాల్గొంటారు. 
 
అయితే... పవన్ కళ్యాణ్ వెబ్ సిరీస్‌లో నటించనున్నారు అనే వార్త బయటకు వచ్చింది. ఇది నిజంగా షాకింగే అని చెప్పచ్చు. కారణం ఏంటంటే.. ఇప్పటికే వరుసగా నాలుగు సినిమాలు చేసేందుకు ఓకే చెప్పడం ఎనౌన్స్ చేయడం జరిగింది. 
 
ఇప్పుడు వెబ్ సిరీస్ చేయనున్నారు అని వార్తలు వస్తుండటంతో అసలు పవన్‌కి ఏమైంది..? వరుసగా ఇలా సినిమాలు చేస్తున్నారు అనుకుంటున్నారు.
 
తాజా సమాచారం ప్రకారం... వెబ్ సిరీస్‌లో నటించడానికి పవన్ ఇంట్రస్ట్‌గా ఉన్నారట. అయితే... మంచి స్ర్కిప్ట్‌తో ఎవరైనా వెబ్ సిరీస్ చేయమని వస్తే.. చేయాలనుకుంటున్నారని తెలిసింది. పవన్ మనసులో వెబ్ సిరీస్ ఉందని తెలిస్తే.. ఓటీటీ సంస్థలు, నిర్మాతలు వెబ్ సిరీస్ చేయమని పవన్ వెంట పడటం ఖాయం. మరి, పవన్ వెబ్ సిరీస్ ఎవరికి చేస్తారో..? ఎప్పుడు చేస్తారో..? అసలు ఎలాంటి వెబ్ సిరీస్ చేస్తారో క్లారిటీ రావాలంటే... కొన్ని రోజులు ఆగాల్సిందే.