సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: గురువారం, 3 సెప్టెంబరు 2020 (12:32 IST)

స్టార్ హీరోలకు చుక్కలు చూపిస్తున్న ప్రభాస్, పవన్

స్టార్ హీరోలకు చుక్కలు చూపిస్తున్నారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇది అభిమానుల్లో హాట్ టాపిక్ అయ్యింది. అదేంటి ప్రభాస్, పవన్ కళ్యాణ్ స్టార్ హీరోలకు చుక్కలు చూపించడం ఏంటి అనుకుంటున్నారా..? మేటర్ ఏంటంటే... చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్… ఒకప్పుడు సంవత్సరానికి ఐదు సినిమాలు చేసేవారు. ఆ తర్వాత సంవత్సరానికి మూడు సినిమాలు చేసేవాళ్లు.
 
అయితే.. ఇప్పుడు స్టార్ హీరోలు సంవత్సరానికి ఒక సినిమా చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే సంవత్సరానికి ఒక సినిమా చేయడం కష్టమైపోతుంది. అయితే... బాహుబలితో చరిత్ర సృష్టించిన ప్రభాస్ స్పీడు పెంచి వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఒక సినిమా సెట్స్ పైన ఉండగానే రెండు మూడు సినిమాలు ఎనౌన్స్ చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్.. రాథేశ్యామ్ అనే సినిమా చేస్తున్నాడు. యు.వి.క్రియేషన్స్ బ్యానర్ పైన రూపొందుతోన్న ఈ మూవీలో రెబల్ స్టార్ కృష్ణంరాజు కీలక పాత్ర పోషిస్తుండడం విశేషం.
 
ఈ మూవీ సెట్స్ లో ఉండగానే… మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్‌తో సినిమాని ఎనౌన్స్ చేసారు. ఈ సినిమాని వైజయంతీ మూవీస్ బ్యానర్ పైన అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్ సరసన దీపికా పడుకునే నటిస్తుంది. ఈ సినిమా ఇంకా స్టార్ట్ చేయలేదు. బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ డైరెక్షన్లో ఆదిపురుష్ మూవీని ఎనౌన్స్ చేసాడు. ఇప్పుడు కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో కూడా మూవీ త్వరలో ఎనౌన్స్ చేయనున్నట్టు సమాచారం. ఈ విధంగా ప్రభాస్ నాలుగు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.
ఇక పవన్ కళ్యాణ్‌ విషయానికి వస్తే… ప్రస్తుతం వకీల్ సాబ్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత క్రిష్ డైరెక్షన్లో మూవీ చేయనున్నాడు. ఇది పాన్ ఇండియా మూవీ. పవన్ చేస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఇదే. ఈ సినిమా తర్వాత గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్‌తో మూవీ చేయనున్నాడు. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. వీటితో పాటు సురేందర్ రెడ్డి డైరెక్షన్లో ఓ మూవీ చేయనున్నారు.
 
ఈవిధంగా పవన్ కళ్యాణ్‌ కూడా నాలుగు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇలా… ప్రభాస్, పవన్ కళ్యాణ్ నాలుగు సినిమాలు చేస్తూ.. మిగిలిన స్టార్ హీరోలకు చుక్కలు చూపిస్తున్నారంటున్నారు. అదీ.. సంగతి..!