సోమవారం, 4 ఆగస్టు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: బుధవారం, 2 సెప్టెంబరు 2020 (14:56 IST)

పవన్ పుట్టినరోజు వస్తే ఏం చేసేవాడో తెలుసా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ పుట్టినరోజు అభిమానులకు పండగ రోజు. అయితే... ఆయనకు మాత్రం రోజులాగే పుట్టినరోజు కూడా ఓ రోజు. తప్పితే పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వరు. హీరో అయిన తర్వాత అభిమానులు, దర్శకులు, నిర్మాతలు పుట్టినరోజును సెలబ్రేట్ చేస్తుంటారు కానీ.. పవన్‌కి మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుందట. ఈ రోజు పవన్ కళ్యాణ్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా పవన్ తన మనసులో మాటలను బయటపెట్టారు.
 
ఇంతకీ... పవన్ ఏం చెప్పారంటే... చిన్నప్పటి నుంచి పుట్టినరోజు చేసుకునే అలవాటు లేదు. ఒకటి రెండు సందర్భాల్లో స్కూల్లో చాక్లెట్స్ పంచినట్టు గుర్తు. ఆ తర్వాత పెద్దగా గుర్తులేదు. నాతో పాటు ఇంట్లో వాళ్లు కూడా మరిచిపోయారు అని పవన్ చెప్పుకొచ్చారు. రెండు రోజుల తరువాత ఇంట్లో ఎవరికో ఒకరికి గుర్తొచ్చేది.
 
గుర్తొచ్చినప్పుడు మా వదిన డబ్బులు ఇస్తే పుస్తకాలు కొనుక్కునే వాడిని. అంతకుమించి ప్రత్యేకంగా జరుపుకోకపోవడం అలవాటు లేదు అన్నారు. సినిమాల్లోకి వచ్చిన తరువాత స్నేహితులు, నిర్మాతలు పుట్టిన రోజు వేడుకలు చేసే ప్రయత్నం చేస్తే ఇబ్బంది అనిపించింది అని చెప్పారు పవన్.