గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 1 డిశెంబరు 2020 (21:13 IST)

భారత మార్కెట్లోకి లెనోవా నుంచి సరికొత్త ల్యాప్‌టాప్

లెనోవా నుంచి సరికొత్త ల్యాప్‌టాప్ మార్కెట్లోకి వచ్చింది. చైనాకు చెందిన ప్రముఖ మల్టీనేషనల్ టెక్నాలజి సంస్థ అయిన లెనోవా నుంచి వచ్చిన ఈ ల్యాప్ టాప్ సరికొత్త ఫీచర్లను కలిగివుంది. భారత మార్కెట్‌లోకి కొత్త ఫీచర్లతో లెనోవా లెజియన్ 5 గేమింగ్ ల్యాప్‌టాప్‌ను విడుదల చేసినట్లు సంస్థ ప్రకటించింది. ఈ ల్యాప్ టాప్‌లో ఎఎమ్‌డి రైజెన్ 4000 సిరీస్ ప్రాసెసర్ వుంటుంది.  
 
ఇంకా ఈ లెనోవా లెజియన్ 5 గేమింగ్ ల్యాప్‌టాప్‌ రూ. 75,990 ఉంటుంది. లెనోవా లెజియన్ 5 ల్యాప్‌టాప్ బరువు 2.3 కిలోలు ఉండగా, హెచ్‌డీ వెబ్‌క్యామ్‌తో ఇది పని చేస్తుంది. లాంచ్ ఆఫర్లలో ఒక సంవత్సరం ఉచిత ప్రీమియం కేర్, ఒక సంవత్సరంపాటు యాక్సిడెంటల్ డ్యామేజ్ ప్రొటెక్షన్ రూ. 3,900 లభించనుంది.