శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 30 నవంబరు 2020 (18:44 IST)

మైక్రోసాఫ్ట్‌ టీమ్స్‌ ఇక బంద్.. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్‌నే ఉపయోగించాలి..

మైక్రోసాఫ్ట్‌ ఇంటర్నెట్‌ ఎక్స్‌ఫ్లోరర్‌లో తన మైక్రోసాఫ్ట్‌ టీమ్స్‌ వెబ్‌ యాప్‌కు సపోర్టును నిలిపివేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ సంస్థ తెలిపింది. మైక్రోసాఫ్ట్‌ టీమ్స్‌ సేవలను ఉపయోగించాలని అనుకుంటే మైక్రోసాఫ్ట్‌ ఎడ్జ్‌ బ్రౌజర్‌ను ఉపయోగించాలని తెలిపింది.
 
మైక్రోసాఫ్ట్‌ ఇంటర్నెట్‌ ఎక్స్‌ఫ్లోరర్‌లో టీమ్స్‌ సేవలు నిలిచిపోనున్నట్లు మైక్రోసాఫ్ట్‌ ఈ ఏడాది ప్రారంభంలో ప్రకటించింది. 2021, ఆగస్టు17నుంచి ఆఫీస్‌ 365, వన్‌డ్రైవ్‌, ఔట్‌లుక్‌ వంటివి ఎక్స్‌ఫ్లోరర్‌ 11కు సపోర్టు చేయవని తెలిపింది. దశల వారీగా వీటిని నిలిపివేయనున్నట్లు ప్రకటించింది.
 
2021,మార్చి 9 తర్వాత నుంచి మైక్రోసాఫ్ట్‌ ఎడ్జ్‌ లెగస్సీ డెస్క్‌ టాప్‌యాప్‌ కొత్త సెక్యూరిటీ అప్‌డేట్స్‌ పొందలేదని తెలిపింది. కొత్త మైక్రోసాఫ్ట్‌ ఎడ్జ్‌ బ్రౌజర్‌ కొత్త విండోస్‌ ఫీచర్‌ అప్‌డేట్‌ అందుబాటులో ఉంటుంది. మైక్రోసాఫ్ట్‌ ఎడ్జ్‌ బ్రౌజర్‌ను మైక్రోసాఫ్ట్‌ కొత్తగా అందుబాటులోకి తీసుకువచ్చింది. క్రోమ్‌ బ్రౌజర్‌ లాగే ఇది కూడా వేగంగా పని చేస్తుందని తెలిపింది. 
 
వచ్చే ఏడాది ఈ సమయానికల్లా మైక్రోసాఫ్ట్ 365 యాప్స్, సర్వీసెస్‌ను ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 11(ఐఈ 11) సపోర్ట్ చేయదని మైక్రోసాఫ్ట్ సంస్థ తెలిపింది. ఆగష్టు 17, 2021 నాటికి మిగిలిన మైక్రోసాఫ్ట్ 365 యాప్స్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 11 లో పని చేయకుండా అవుతాయని మైక్రోసాఫ్ట్ సంస్థ పేర్కొన్నది.