శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 30 నవంబరు 2020 (15:54 IST)

డిసెంబర్ 1,2,3 తేదీల్లో భారీ డిస్కౌంట్లు-ఫ్లిఫ్ కార్ట్ బంపర్ ఆఫర్లు

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిఫ్‌కార్ట్ డిసెంబర్ 1,2,3 తేదీల్లో భారీ డిస్కౌంట్లు, బంపర్ ఆఫర్లు ప్రకటించింది. ఎలక్ట్రానిక్ యాక్సెసరీలపై 80శాతం, టీవీలు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లపై 50శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది. వినియోగదారులను ఆకట్టుకునే దిశగా.. ప్రతీ నెల మొదటి మూడు రోజుల పాటు ఫ్లిఫ్ స్టార్ట్ డేస్ సేల్ పేరుతో ప్రత్యేక సేల్ నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో భాగంగానే ప్రతి నెల మూడు రోజుల పాటు భారీ ఆఫర్లను అందిస్తోంది. 
 
ఈ క్రమంలో పాదరక్షలు, బట్టలు, క్రీడా పరికరాలు, ఫర్నిచర్, ఇంటి డెకర్ తదితర ఉత్పత్తులపై కూడా తగ్గింపును ప్రకటించింది. హెడ్‌ఫోన్‌లు, స్పీకర్లపై 70% వరకు తగ్గింపును అందిస్తోంది. ల్యాప్‌టాప్‌లపై 30% వరకు తగ్గింపులు ఉన్నాయి. స్మార్ట్‌వాచ్‌లు, ఫిట్‌నెస్ బ్యాండ్‌ వంటి వాటిని కొనేవారికి మంచి తగ్గింపును ప్రకటించింది. నోకాస్ట్ ఈఎంఐ సదుపాయం, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, వారంటీ పొడగింపు వంటి సదుపాయం కూడా ఉంది.