1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
  4. Redmi smartphone price increases

స్మార్ట్ ఫోన్ ధరలను పెంచేసిన రెడ్ మీ.. ధరలెంతో తెలుసా?

Redmi
Redmi
రెడ్ మీ తమ సంస్థకు చెందిన స్మార్ట్ ఫోన్ల ధరలను పెంచింది. ఈ వివరాల్లోకి వెళితే.. రెడ్ మీ నోట్ 8 4జీబీ మోడల్ ధర ఇప్పటి వరకు రూ.11,499 పలికింది. ఈ ఫోన్ ధర ప్రస్తుతం రూ.11,999లని రెడ్ మీ తెలిపింది.
 
రెడ్ మీ నోట్ 8 6జీబీ ప్లస్ 128 జీబీ మోడల్ రూ. 13,999 నుంచి రూ.14,499కి పెరిగింది. అలాగే రెడ్ మీ 8 4జీబీ ప్లస్ 64 మోడల్ రూ.9299 నుంచి రూ.9499కి పెరగగా, రెడ్ మీ 8ఎ డుయెల్ 2జీబీ ప్లస్ 32 మోడల్ రూ.7299 నుంచి రూ.7499 వరకు పెరిగినట్లు జియోమీ తెలిపింది. 
About Writer
సెల్వి
తర్వాతి కథనం
లాక్ డౌన్ నిబంధనలు సడలింపు: తగ్గిన బంగారం ధరలు