1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
  4. Reliance Jio now giving 8 GB of free data

జియో బంపర్ ఆఫర్... ఉచితంగా 8 జీబీ డేటా

రిలయన్స్ జియో మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. తన కస్టమర్లందరికీ ఉచితంగా 8 జీబీ డేటాను రిలయన్స్ జియో ఇచ్చింది. అలాగే, ఈనెల కూడా 8జీబీ డేటాను ఇవ్వనున్నట్టు తెలిపింది.

Reliance Jio
రిలయన్స్ జియో మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. తన కస్టమర్లందరికీ ఉచితంగా 8 జీబీ డేటాను రిలయన్స్ జియో ఇచ్చింది. అలాగే, ఈనెల కూడా 8జీబీ డేటాను ఇవ్వనున్నట్టు తెలిపింది. ఈ 8జీబీ డేటాను రోజుకు 2జీబీ చొప్పున మొత్తం 4 రోజుల వాలిడిటీతో ఉపయోగించుకునే వెసులుబాటు కల్పించింది.
 
ఈ మొత్తం డేటా ఇప్పటికే జియో కస్టమర్ల ఖాతాల్లోకి చేరిపోయివుంటుంది. ఇపుడు దాన్ని నేరుగా వాడుకోవచ్చు. అందుకు ఎలాంటి రిక్వెస్ట్ పెట్టుకోవాల్సిన పనిలేదు. అదేవిధంగా ఆ డేటాను మై జియో యాప్‌లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు కూడా. ఐపీఎల్ సీజన్ ముగుస్తున్న సందర్భంగా జియో ఈ డేటాను క్రికెట్ సీజన్ డేటా ప్యాక్ కింద అందివ్వనుంది. 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
ప్రతి భారతీయుడికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా : ప్రధాని మోడీ