1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
  4. Reliance JIO will give 80,000 jobs

నిరుద్యోగులకు గుడ్ న్యూస్: రిలయన్స్ జియో నుంచి వేలాది ఉద్యోగాలు

దేశవ్యాప్తంగా ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో.. తాజాగా తన కస్టమర్లకు 112 జీబీ ఉచిత డేటాను అందించింది. జియోఫోన్ మ్యాచ్ పాస్ కింద ఐపీఎల్ మ్యాచ్‌లు చూసేందుకు వీలుగా ఈ ఆఫర్‌ను రిలయన్స్ ప్ర

Reliance JIO
దేశవ్యాప్తంగా ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో.. తాజాగా తన కస్టమర్లకు 112 జీబీ ఉచిత డేటాను అందించింది. జియోఫోన్ మ్యాచ్ పాస్ కింద ఐపీఎల్ మ్యాచ్‌లు చూసేందుకు వీలుగా ఈ ఆఫర్‌ను రిలయన్స్ ప్రకటించింది. 56 రోజుల వ్యాలిడిటీతో జియో 112 జీబీ డేటాను పూర్తి ఉచితంగా అందిస్తోంది. తాజాగా నిరుద్యోగులకు జియో గుడ్ న్యూస్ చెప్పింది. 
 
ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో 75,000-80,000 మంది దాకా సిబ్బందిని రిక్రూట్‌ చేసుకోనున్నట్లు రిలయన్స్‌ జియో చీఫ్‌ హ్యూమన్‌ రిసోర్సెస్‌ ఆఫీసర్‌ సంజయ్‌ జోగ్‌ వెల్లడించారు. ప్రస్తుతం కంపెనీలో 1,57,000 మంది సిబ్బంది ఉన్నారని సంజయ్ జోగ్ వెల్లడించారు. దేశ వ్యాప్తంగా ఆరువేల కాలేజీలతో జియో ఒప్పందం చేసుకున్నానని చెప్పారు. 60–70 శాతం నియామకాలు కాలేజీలు, ఉద్యోగుల నుంచి వచ్చే రిఫరల్స్‌ ద్వారానే సంజయ్ చెప్పారు.
About Writer
selvi
తర్వాతి కథనం
సారీ చెప్పినా.. చంద్రబాబు కనికరించలేదు... అనిత తొలగింపు