శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 27 ఏప్రియల్ 2018 (09:18 IST)

క్యాస్టింగ్ కౌచ్‌ విధానంపై శ్రీరెడ్డి ధర్మా చేస్తే నాకేంటి సంబంధం: నారా లోకేష్

క్యాస్టింగ్ కౌచ్ విధానంపై శ్రీరెడ్డి ధర్నా చేస్తే తనకు సంబంధం ఏంటని ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రశ్నించారు. సినీ పరిశ్రమపై తనకు అవగాహన లేదని, వ్యక్తిగతంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే తనకు ఎప్పుడూ గౌరవమ

క్యాస్టింగ్ కౌచ్ విధానంపై శ్రీరెడ్డి ధర్నా చేస్తే తనకు సంబంధం ఏంటని ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రశ్నించారు. సినీ పరిశ్రమపై తనకు అవగాహన లేదని, వ్యక్తిగతంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే తనకు ఎప్పుడూ గౌరవమే ఉంటుందని నారా లోకేష్ తెలిపారు.


పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై నారా లోకేష్ మండిపడ్డారు. యువనటి శ్రీరెడ్డి తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలను పదే పదే చూపిస్తూ డిబేట్లు నిర్వహించిన పలు టీవీ ఛానెళ్లపై మండిపడుతోన్న పవన్ కల్యాణ్.. ఏపీ మంత్రి నారా లోకేష్‌పై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. 
 
పవన్ కల్యాణ్ కామెంట్స్‌పై నారా లోకేష్ స్పందించారు. పవన్ తనపై ఆరోపణలు చేస్తున్నారని.. శ్రీరెడ్డి విషయంలో విమర్శలు చేస్తున్నారని తెలిపారు. తనపై పవన్ చేస్తోన్న ఆరోపణల్లో ఆధారాలు ఉంటే బయట పెట్టాలని తాను ఇప్పటికే ట్విట్టర్‌లో కోరానని నారా లోకేశ్‌ తెలిపారు. తాను ఎనిమిదేళ్ల నుంచి తన ఆస్తులు ప్రకటిస్తున్నానన్నారు. 
 
పవన్‌ తనపై చేసిన అవినీతి ఆరోపణలకు, శ్రీరెడ్డి విషయంలో చేసిన ఆరోపణలకు ఆధారాలుంటే చూపించాలని లోకేష్ సవాల్ విసిరారు. పవన్‌ అంటే వ్యక్తిగతంగా తనకు ఎప్పుడూ గౌరవమేనని నారా లోకేష్ చెప్పారు. పవన్‌ చుట్టు కొందరు చేరి తప్పుదోవ పట్టిస్తున్నారని నారా లోకేష్ తెలిపారు.

మంత్రి లోకేష్ అడ్డూ అదుపూ లేకుండా అవినీతికి పాల్పడుతున్నారని, నారా లోకేష్ అవినీతిని చూసి తాత ఎన్టీఆర్‌ ఆత్మ కూడా క్షోభించి ఉంటుందని పవన్‌ కళ్యాణ్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.