గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 26 ఏప్రియల్ 2018 (10:54 IST)

గవర్నర్ చాలా సాఫ్ట్‌గా ఉంటారు. కానీ బతకనేర్చిన మనిషి: జేసీ కామెంట్స్

తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌పై తెలుగుదేశం పార్టీ నేత, ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. నరసింహన్ గారు తనకు చాలాకాలంగా తెలుసు. ఆయన సాఫ్ట్‌గా వుంటారు. అయితే బతకనేర్చిన మనిషి

తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌పై తెలుగుదేశం పార్టీ నేత, ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. నరసింహన్ గారు తనకు చాలాకాలంగా తెలుసు. ఆయన సాఫ్ట్‌గా వుంటారు. అయితే బతకనేర్చిన మనిషి అంటూ జేసీ అన్నారు. 
 
ఒక్కే ఒక్క వాక్యంలో చెప్పాలంటే.. ఆయన గవర్నర్ కాబట్టి తన బుద్ధికొచ్చినట్లు మాట్లాడటం మంచిది కాదని జేసీ తెలిపారు. ఎప్పటికేది మాట్లాడాలో అది మాట్లాడుతారు.. ఆనాడు ఇందిరాగాంధీకి అత్యంత దగ్గరగా వున్న వ్యక్తి నరసింహన్ గారు. ఇవాళ ఏపీలో మోదీకి ఎవరైనా దగ్గరివారంటే ఈయనేనని తెలిపారు.  
 
ఇదిలా ఉంటే.. గవర్నర్ నరసింహన్ మీడియాపై మండిపడ్డారు. ఇచ్చిన బాధ్యతలన్నీ చాలా చక్కగా నెరవేర్చానని.. తాను వెళ్ళిపోయాక ఇంతకంటే మంచి గవర్నర్ లేరని మీరే రాస్తారు. తాను ఏ పదవీ లేకుండా దేవాలయాలకు వెళ్లా.. పదవి నుంచి విరమించిన తర్వాత కూడా వెళ్తుంటానని.. దేవాలయాలకు వెళ్తే తనకు శాంతి లభిస్తుందని గవర్నర్ తెలిపారు. 
 
కాగా 11 సంవత్సరాలు గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న నరసింహన్‌ను తప్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. అందుకే ఢిల్లీకి నరసింహన్‌ను పిలిపించిందని టాక్. గత ఏడాది మే 2న ఆయన పదవీ కాలం ముగిసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేదాకా గవర్నర్‌గా నరసింహన్ కొనసాగుతారని సమాచారం.