శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By selvi
Last Updated : గురువారం, 19 ఏప్రియల్ 2018 (11:13 IST)

ఆ రెండు పార్టీలు రాజీనామాలు చేసి వెళ్ళిపోండి.. లేదా కలిసి చావండి: తమ్మారెడ్డి

ఏపీలోని రెండు రాజకీయా పార్టీలు రాజీనామాలు చేసి వెళ్ళిపోండి.. మేమే చూసుకుంటాం అని సినీ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. తానీ ఏ రాజకీయపార్టీకి చెందిన వాడిని కాదని.. తెలుగు ప్రజల శ్రేయస్సే

ఏపీలోని రెండు రాజకీయా పార్టీలు రాజీనామాలు చేసి వెళ్ళిపోండి.. మేమే చూసుకుంటాం అని సినీ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. తానీ ఏ రాజకీయపార్టీకి చెందిన వాడిని కాదని.. తెలుగు ప్రజల శ్రేయస్సే తనకు కావాలన్నారు.

టీడీపీ వాళ్లు వైసీపీ నేతలను తిట్టడం, తిరిగి వైసీపీ వాళ్లు టీడీపీ వాళ్లను తిట్టడం ఫ్యాషనైపోయిందని తమ్మారెడ్డి ధ్వజమెత్తారు. నిజంగా వీరికి చిత్తశుద్ధి ఉంటే ఒకరినొకరు తిట్టుకోకూడదని.. మీరు తిట్టుకుంటుంటే.. వాటిని వినడానికా తామున్నది అంటూ తమ్మారెడ్డి ప్రశ్నించారు. 
 
ప్రజలు మంచి జరుగుతుందనే ఉద్దేశ్యంతోనే ఓట్లు వేశామన్నారు. రెండు పార్టీలూ దొంగలే అని వాళ్ల తిట్లు వింటుంటే అసహ్యం వేస్తోందని మండిపడ్డారు. రాజీనామాలు చేసి వెళ్లిపోండి.. మేమే చూసుకుంటామన్నా.. అది మాత్రం చేయరు. పదవులను పట్టుకుని వేలాడుతూ.. ఒకరినొకరు తిట్టుకుంటూ సమయాన్ని గడిపేస్తారని తమ్మారెడ్డి అన్నారు. నాలుగేళ్లు గడిచిపోయాయి. ఈ సంవత్సరమన్నా కలిసి చావండి, రాష్ట్రానికి బాగుంటుందని తమ్మారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.