మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 21 ఫిబ్రవరి 2018 (14:04 IST)

మారనున్న మొబైల్ నంబర్లు.. ఇకపై 10 అంకెల స్థానంలో 13 అంకెలతో నంబర్

దేశవ్యాప్తంగా మొబైల్ నంబర్లు మారనున్నాయి. ప్రస్తుతమున్న 10 అంకెల నంబర్లు ఇకపై 13 అంకెల నంబర్లుగా కనిపించనున్నాయి. వినియోగదారులకు మరింత భద్రత కల్పించే విధంగా టెలీకాం శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది.

దేశవ్యాప్తంగా మొబైల్ నంబర్లు మారనున్నాయి. ప్రస్తుతమున్న 10 అంకెల నంబర్లు ఇకపై 13 అంకెల నంబర్లుగా కనిపించనున్నాయి. వినియోగదారులకు మరింత భద్రత కల్పించే విధంగా టెలీకాం శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. 
 
'మెషీన్ టు మెషీన్ కమ్యూనికేషన్స్‌ (ఎం2ఎం)లో స్పెక్ట్రమ్, రోమింగ్, క్యూవోఎస్‌కు సంబంధించి' టెలీకాం కంపెనీ నిర్ణయం తీసుకుంది. టెలీకం శాఖ సిమ్ ఆధారిత ఎం2ఎం డివైజ్‌ల కోసం 13 అంకెల నంబరింగ్ సిరీస్‌ను ఆమోదించింది. ఫలితంగా ఇప్పటికే చలామణీలో ఉన్న 10 అంకెల నంబర్‌తో పాటు పనిచేసే విధంగా కొత్త నంబరింగ్ విధానం జూలై ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానుంది. 
 
ఈ నిర్ణయంతో దేశంలోని మొత్తం సిమ్ ఆధారిత ఎం2ఎం (మెషీన్ టు మెషీన్) వినియోగదారులకు... 13 అంకెలతో కూడిన మొబైల్ నంబర్లను ఇవ్వాలని టెలీకాం కంపెనీలకు ఆదేశాలు జారీచేసింది. ఇప్పటికే 10 అంకెల ఫోన్ నంబర్ వాడుతున్న వినియోగదారులు ఈ యేడాది అక్టోబర్ 1 నుంచి 13 అంకెల నంబరుకు పోర్టబుల్ చేసుకోవాలి. డిసెంబర్ 31 నాటికల్లా పోర్టబులిటీ గడువు ముగుస్తుంది.
 
'ఈ యేడాది జూలై 1 నుంచి 13 అంకెల ఎం2ఎం నంబర్ విధానాన్ని అమలు చేయాలని టెలీకాం శాఖ నిర్ణయించింది. ఆ రోజు నుంచి కొత్తగా తీసుకునే అన్ని మొబైల్ ఫోన్ నంబర్లలో 13 అంకెలు ఉంటాయి. ఇప్పటికే 10 అంకెల నంబర్‌ వాడుతున్న వినియోగదారులు అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31లోపు కొత్త నంబర్‌కు మారాల్సి ఉంటుంది' అని ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్‌కు చెందిన సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.