1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
  4. WhatsApp Update: WhatsApp to Introduce Offline File Sharing Feature

ఇక వాట్సాప్‌లోనూ ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే ఫైల్స్ షేరింగ్

whatsapp
యాపిల్ ఎయిర్‌డ్రాప్ తరహాలో ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే ఫైల్‌లను షేర్ చేసుకునేందుకు వినియోగదారులను అనుమతించే అద్భుతమైన ఫీచర్‌ను వాట్సాప్ పరిచయం చేయడానికి సిద్ధమవుతోంది. ప్రారంభంలో ఆండ్రాయిడ్‌ ఫోన్‌ల కోసం ఆవిష్కరించిన ఈ ఫీచర్.. త్వరలో iOS వినియోగదారులకు కూడా అందుబాటులో వుంచేందుకు వాట్సాప్ సిద్ధం అవుతుంది. 
 
అయితే, రెండు ప్లాట్‌ఫారమ్‌ల కోసం రోల్‌అవుట్ ఇంకా పెండింగ్‌లో ఉంది. వాట్సాప్ యూజర్లకు తరచుగా కొత్త అప్‌డేట్‌లు, కొత్త ఫీచర్‌లను అందుబాటులో తెస్తోంది. ఇందులో భాగంగా రాబోయే ఫైల్-షేరింగ్ ఫీచర్ మినహాయింపు కాదు. 
 
WABetaInfo ప్రకారం, ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేకుండా సమీపంలోని పరికరాలతో పత్రాలు, ఫోటోలు, వీడియోలు, ఇతర ఫైల్‌లను భాగస్వామ్యం చేయడానికి అనుమతించే కొత్త ఫీచర్ ఫైల్ -షేరింగ్ రానుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్, iOS కోసం బీటా టెస్టింగ్ దశలో ఉంది.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
గంగానదిలో కొట్టుకుపోయిన వ్యక్తి.. దేవుడిలా కాపాడిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది (వీడియో)