సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 27 జూన్ 2024 (10:17 IST)

త్వరలోనే వాట్సప్ యాప్ నుంచి కాలింగ్ సౌకర్యం

whatsapp
త్వరలోనే వాట్సప్ యాప్ నుంచి కాలింగ్ సౌకర్యం రానుంది. యూజర్ల కాలింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా వాట్సప్ యాప్ నుంచే సాధారణ కాలింగ్ ఆప్షన్‌ అందించేందుకు మెటా కృషి చేస్తోంది. 
 
కాలింగ్ కోసం యాప్ నుంచి ఎగ్జిట్ కావాల్సిన అవసరం ఉండదు. నేరుగా వాట్సప్ నుంచే కాల్స్ చేసుకోవచ్చు. ఈ మేరకు ఆండ్రాయిడ్ 2.24.13.17 అప్‌డేటెడ్ బీటా వెర్షన్‌లో అందుబాటులో ఉందని వాట్సప్‌బీటాఇన్ఫో ప్రకటించింది. 
 
ఈ మేరకు త్వరలోనే ఇన్-యాప్ డయలర్ ఫీచర్‌‌ని జోడించబోతోంది. వాట్సప్ యూజర్ యాప్ నుంచి ఎగ్జిట్ కాకుండానే కాల్స్ చేసుకోవచ్చు. 
 
ఇందుకోసం యూజర్లు కాంటాక్ట్ బుక్‌ను యాడ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదని తెలిపింది. కాలింగ్‌తో పాటు మెసేజింగ్ షార్ట్‌కట్ డయలర్ స్క్రీన్‌ కూడా అందుబాటులోకి వస్తుందని వివరించింది.