1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 20 మే 2024 (11:24 IST)

వాట్సాప్‌ కొత్త అప్డేట్.. స్టేటస్‌ వీడియో సమయం పెంచేసింది..

whatsapp
వాట్సాప్‌ కొత్త అప్డేట్ అందుబాటులోకి తీసుకొస్తోంది. స్టేటస్‌ వీడియో సమయం పెరిగింది. తాజాగా వాట్సాప్‌ iOS యూజర్లు ఎక్కువ నిడివి ఉన్న వీడియోలను స్టేటస్‌లుగా పోస్టు చేయవచ్చు. ప్రస్తుతం ఈ టెస్టంగ్‌ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. 
 
ప్రస్తుతం ఈ ఫీచర్‌ iOS 24.10.10.74 బీటా వెర్షన్‌లో ఉంది. దీని ద్వారా గరిష్ఠంగా ఒక నిమిషం పాటు వాట్సాప్‌ స్టేటస్‌ను అప్‌లోడ్‌ చేసుకునే వీలుంటుందని మెటా ప్రకటించింది. ఈ ఫీచర్‌ను ఇప్పటికే ఆండ్రాయిడ్‌లోనూ టెస్టింగ్‌ చేశారు. 
 
ప్రస్తుతం ఒకసారి 30 సెకన్లపాటు మాత్రమే స్టేటస్‌ వీడియో పోస్టు చేసేందుకు అవకాశం ఉంది. ఈ ఫీచర్‌ అందుబాటులోకి వస్తే ఒక నిమిషం పాటు స్టేటస్‌ వీడియోలను పోస్ట్‌ చేయవచ్చు. ఈ ఫీచర్ త్వరలో అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.