ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 2 జులై 2024 (12:18 IST)

ముంబైలో చెర్రీ ఇంట్లోనే వుండిపోయా.. ఎవరికీ చెప్పొద్దన్నాడు.. మంచు లక్ష్మి

manchu lakshmi prasanna
టాలీవుడ్ స్టార్ హీరోల టాప్ సీక్రెట్స్ గురించి యాక్షన్ కింగ్ మోహన్ బాబు తనయ మంచులక్ష్మి సీక్రెట్స్ బ‌హిరంగంగా వెల్ల‌డించారు. రామ్ చరణ్, రానా దగ్గుబాటి, అల్లు అర్జున్‌ సహా 142 మంది నటీనటులతో వాట్సాప్ గ్రూప్‌లో తాను కూడా భాగంగా ఉన్నానని ల‌క్ష్మీ తెలిపారు. 
 
తెలుగు చిత్ర పరిశ్రమలో కుటుంబ భావనను సులభతరం చేసేందుకు ఈ గ్రూప్‌ను రూపొందించామని, తద్వారా నటీనటులు తమ చిత్రాలను, తాజా ప్రాజెక్టులను ప్రమోట్ చేసుకోవడంలో ఒకరికొకరు సహాయం చేసుకోవచ్చని అన్నారు.
 
తాజాగా ఇంట‌ర్వ్యూలో రామ్ చరణ్, రానా దగ్గుబాటితో తన స్నేహం ముంబైకి వెళ్లడానికి కార‌ణ‌మైంద‌ని ల‌క్ష్మీ టాప్ సీక్రెట్‌ని రివీల్ చేసారు. వారు ప్ర‌భావితం చేయ‌డం వ‌ల్ల‌నే తాను ముంబైలో అవ‌కాశాల‌ను ప‌రిశీలిస్తున్నార‌ని చెప్పారు. 
 
అంతేకాదు ముంబైలో రామ్ చరణ్ ఇంట్లోనే ఉండిపోయానని అయితే అది ఎవరికీ చెప్పలేదని చెప్పారు. తాను ముంబైలోని తన ఇంట్లో ఉంటున్నానని జ‌నాలకు చెప్పవద్దని రామ్ చరణ్‌కు చెప్పిన‌ట్టు తెలిపారు. ప్రస్తుతం మంచు లక్ష్మి కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.