పిల్లల పోషణ భారం తండ్రిపై కూడా ఉంటుంది? ఎందుకని?
పిల్లల పోషణ భారం.. తండ్రిపై ఉండేందుకు కారణమేమిటో తెలుసా? అయితే ఈ స్టోరీ చదవండి. పిల్లల పోషణ భారం సాధారణంగా తల్లులదే అయినప్పటికీ తండ్రి పాత్ర కూడా ఉంటుందనేది అందరికీ తెలిసింది. దీనికి అసలు కారణం ఏమిటో తాజాగా జరిగిన పరిశోధనలో వెల్లడైంది. పిల్లల పోషణను పూర్తిగా భుజాన వేసుకున్న తండ్రుల మెదడు తల్లుల మెదడు స్పందనలతో సరిసమానంగా స్పందిస్తుందనే కొత్త విషయం వెలుగులోకి వచ్చింది.
అంతేకాకుండా పిల్లలు పుట్టగానే తల్లితో పాటు తండ్రిలోనూ హార్మోన్ల మార్పిడి జరుగుతుందని 'ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడెమీ ఆఫ్ సైన్స్' తాజా సంచికలో ప్రచురితమైన ఓ పరిశోధన కథనం తెలిపింది. కొత్తగా తల్లిదండ్రులైన 89 జంటలపై ఇటీవల జరిగిన పరిశోధనల్లో ఈ ఆసక్తికర అంశం వెల్లడైంది.