గొడుగు వానకా?... ఎండకా...?
FILE
ఐరోపాలో గ్రీకులు గొడుగును ఎండకు రక్షణగా ఉపయోగించేవాళ్లు. ఉన్నత వర్గాలు, రాజ కుటుంబీకులు మాత్రమే గొడుగులను నీడకోసం వాడేవాళ్లు. వీళ్లందరికీ విరుద్ధంగా గొడుగును వానకు తడకుండా ఉపయోగించే వాళ్లు.... ప్రాచీన రొమన్లు. 1680లో ఫ్రాన్స్‌లో, తర్వాత ఇంగ్లండ్‌లో గొడుగు వాడకం మొదలైంది. 18వ శతాబ్దం నుంచి ఐరోపా అంతటా వానకు రక్షగా గొడుగును వాడటం మొదలుపెట్టారు. ఇదీ గొడుగు కథ.
