మురుకులు (జంతికలు)
|
సెనగపప్పు - 500 గ్రా
మినప పప్పు - 200 గ్రా
పెసర పప్పు - 500 గ్రా
బియ్యం - 10 గ్లాసులు ( కావలంటే కొంచెం తగ్గించుకోవచ్చు)
నువ్వులు - 50 గ్రాములు
నూనె - కాల్చేందుకు సరిపడ
ఉప్పు.. కారం, తగినంత
తయారీ విధానం:
ముందుగా సెనగపప్పును దోరగా వేగించి పెట్టుకోవాలి. బియ్యాన్ని కూడా వేగించాలి. వీటన్నిటి కలిపి మరలో పిండి పట్టించాలి. దానిలో నువ్వులు, ఆరు స్పూన్ల మరిగించిన నూనె, తగినంత ఉప్పు, కారం, నీరు పోసి కలిపిన ముద్దగా చేసుకోవాలి. ఆ తర్వాత మురుకుల గొట్టం (జంతికల)లో పెట్టి కాగుతున్న నూనెలో మనకు ఇష్టమైన ఆకారాల్లో చుట్టచుట్టలుగా చేసుకుంటూ... బాగా కాగుతున్న నూనెలో వేయాలి. ఆ తర్వాత కొంచెం దోరగా వేగిన తర్వాత జంతికలను తీసి ఆరబెట్టి ఒక డబ్బాలో ఉంచుకోవాలి. వీటిని ఒక వారం రోజుల పాటు హాయిగా ఆరగించవచ్చు.
