బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 5 జులై 2018 (15:31 IST)

పైకి స్పా సెంటర్.. లోపల హెటెక్ వ్యభిచారం... ఫారిన్ గర్ల్స్‌తో...

పైకి స్పా సెంటర్.. కానీ లోపల మాత్రం హైటెక్ వ్యభిచారం. ఈ గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ వ్యభిచార దందా హర్యానాలోని గుర్గావ్‌లో వెలుగుచూసింది. హర్యానాలోని గుర్గావ్ సెక్టార్ 29 మార్కెట్‌‌లో ఉన్న ఓ స్పా

పైకి స్పా సెంటర్.. కానీ లోపల మాత్రం హైటెక్ వ్యభిచారం. ఈ గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ వ్యభిచార దందా హర్యానాలోని గుర్గావ్‌లో వెలుగుచూసింది. హర్యానాలోని గుర్గావ్ సెక్టార్ 29 మార్కెట్‌‌లో ఉన్న ఓ స్పా సెంటర్ కేంద్రంగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు మఫ్టీలో కస్టమర్లుగా ఆ స్పా సెంటర్‌కు వెళ్లారు.
 
అపుడు థాయిలాండ్‌‌కు చెందిన ఐదుగురు మహిళలతో పాటు మణిపూర్‌కు చెందిన ఐదుగురు అమ్మాయిలు ఉన్నారు. వీరితో పాటు ఇద్దరు విటులను పోలీసులు అరెస్టు చేశారు. స్పా ఓనర్ యుద్‌ వీర్ సింగ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఈ వ్యభిచార గుట్టు బుధవారం వెలుగులోకి వచ్చింది. ఈ సెంటర్‌లో విదేశీ అమ్మాయిలను ప్రతి వారం పది రోజులకు ఒకసారి మార్చేవారనీ పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.