బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: సోమవారం, 5 ఫిబ్రవరి 2018 (15:35 IST)

ప్రేమికుడి మోసం... తప్పతాగి అతడి ఇంటి ముందు డ్యాన్స్ చేసిన యువతి (వీడియో)

సహజంగా ప్రేమించిన అమ్మాయి ముఖం చాటేస్తే కొందరు అబ్బాయిలు హంగామా చేయడం వంటి సంఘటనలు చూస్తుంటాం. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. తనను ప్రేమించి మోసం చేసిన యువకుడు సిగ్గుతో తల దించుకునేట్లు ఓ యువతి వీధిలో డ్యాన్స్ చేసి హంగామా చేసింది. గుర్గావ్‌లో ఈ ఘట

సహజంగా ప్రేమించిన అమ్మాయి ముఖం చాటేస్తే కొందరు అబ్బాయిలు హంగామా చేయడం వంటి సంఘటనలు చూస్తుంటాం. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. తనను ప్రేమించి మోసం చేసిన యువకుడు సిగ్గుతో తల దించుకునేట్లు ఓ యువతి వీధిలో డ్యాన్స్ చేసి హంగామా చేసింది. గుర్గావ్‌లో ఈ ఘటన జరిగింది. 
 
తనను మోసం చేసిన ప్రియుడి ఇంటి ముందు డీజేతో సహా వచ్చి స్టెప్పులేసింది. మధ్యమధ్యలో అతడిని దూషించింది. "తేరే ఇష్క్ మే నాచింగ్'' అంటూ ఆ అమ్మాయి బ్రేకప్ స్టెప్పులేస్తుంటే వీధుల్లో వున్న జనం అలా చూస్తుండిపోయారు. ఆమె నృత్యాన్ని ఆపేందుకు ఓ యువతి ప్రయత్నించినా విఫలమైంది. మొత్తమ్మీద డీజేతో సహా ప్రియుడి ఇంటి ముందు అలా డ్యాన్స్ చేస్తుంటే పోలీసులు కూడా ఏమీ చేయలేక చోద్యం చూస్తుండిపోయారు. చూడండి మీరు కూడా ఆ వీడియోను...