1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Abhinandan mustache become trending

అభినందన్ మీసకట్టు అదిరింది... అదే కావాలంటున్న యూత్...

Abhinandan
పాకిస్థాన్‌కి పట్టుబడిన భారత వింగ్ కమాండర్ పైలట్ అభినందన్ వర్ధమాన్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలుస్తున్నాడు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ముందస్తుగా ప్రకటించిన విధంగా మార్చి 1వ తేదీ రాత్రి 9.19 నిమిషాలకు అభినందన్‌ని భారత్‌కి అప్పగించింది.

కాగా అతడు పాక్‌కి పట్టుబడిన వైనం, పాకిస్థాన్ యుద్ధ విమానాలను తరుముతూ నియంత్రణ రేఖ దాటివెళ్లి, పాక్‌కి చెందిన ఎఫ్-16 విమానాన్ని తన మిగ్ 21 యుద్ధ విమానంతో కూల్చాడు. అంతలో తాను ప్రయాణిస్తున్న మిగ్ 21కి సాంకేతిక లోపం ఏర్పడటంతో పారాచూట్ సాయంతో సురక్షితంగా పాకిస్థాన్‌లో ల్యాండ్ అయ్యాడు. 
 
అయితే బాగా దెబ్బలు తిని, ప్రాణాల మీదకు వచ్చినప్పటికీ తన ధైర్యాన్ని కోల్పోకుండా, వారు అడుగుతున్న ప్రశ్నలకు ఏమాత్రం తడుముకోకుండా, బెదరకుండా సమాధానాలు ఇచ్చాడు. కాగా ఆ ఫుటేజీలో అభినందన్ మీసకట్టుకు యావత్ ప్రపంచంలో ఉండే యువత దాసోహం అంటోంది. ఇప్పుడు ఏ సెలూన్‌లో చూసినా అతని మీసకట్టు టాక్ నడుస్తోంది. 
 
అతడి మీసకట్టు ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్‌గా మారింది. చివరికి పాక్ ప్రజలు సైతం ఆ మీసకట్టుకు పడిపోయారు. వారు కూడా ఇలాంటి మీసకట్టు పెట్టుకుంటే బాగుంటుందని అంటున్నారు. ఏది ఏమైనా అభినందన్ ఇప్పుడు సినిమాలో హీరోల మాదిరి తన మీసం పవర్‌తో భారత్ పరువును నిలబెట్టడమే కాకుండా యువతకు ఆదర్శంగా నిలిచాడు.
About Writer
మోహన్ మొగరాల
తర్వాతి కథనం
వీడిన శ్రీజ్యోతి మిస్టరీ : 20 యేళ్లు చిన్నదైనా ఆశపడ్డాడు.. కాదన్నందుకు కడతేర్చాడు...