1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. After Jamui, another minor girl molested in Bihar’s Samastipur

బీహార్‌లో రెచ్చిపోతున్న కామాంధులు... టూరిస్ట్ ప్లేస్‌లో అమ్మాయికి వేధింపులు..

victim woman
బీహార్ రాష్ట్రంలో కామాంధులు రెచ్చిపోతున్నారు. ఇటీవల జుమౌలో ఓ మైనర్ బాలికను వేధించిన ఘటన మరచిపోకముందే ఇపుడు సమస్తీపుర్‌లో మైనర్ బాలికను కొందరు అల్లరి మూకలు చుట్టుముట్టి వేధించారు. తాజాగా బంకా జిల్లాలోనూ ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. 
 
జిల్లాలోని ప్రముఖ టూరిస్టు స్పాట్‌ అయిన మందర్‌ హిల్‌ వద్ద ఓ అమ్మాయిపై ఆరుగురు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. బాధితురాలితో వారు అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు ఆమెను కొట్టారు. సెప్టెంబరు 3న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో పోలీసులు సుమోటోగా దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
 
ఇటీవల జుమౌ జిల్లాలో స్నేహితులైన ఇద్దరు టీనేజర్లు.. కోచింగ్‌ సెంటర్‌కు వెళ్లి వస్తుండగా రోడ్డుపైనే దుండగులు అడ్డగించిన సంగతి తెలిసిందే. బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. గట్టిగా పట్టుకుని లాక్కెళ్లారు. అభ్యంతరకరంగా తాకారు. ఈ ఘటన మరువక ముందే.. సమస్తీపుర్‌ జిల్లాలోనూ ఓ టీనేజీ అమ్మాయి, అబ్బాయి కలిసి రోడ్డుపై నడుచుకుంటూ ఫొటోలు తీసుకుంటుండగా కొందరు ఆకతాయిలు అడ్డగించి అమానుషంగా ప్రవర్తించారు. ఇలా వరుస ఘటనలు బిహార్‌లో రాజకీయ దుమారం రేపాయి. రాష్ట్రంలో అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
ఖైరతాబాద్, బాలాపూర్ గణేష్ శోభాయాత్ర ప్రారంభం.. (Videos)