సంబంధిత వార్తలు
- అలాంటి పార్టీతో ఎవరైనా పొత్తు పెట్టుకుంటారా? టీడీపీ వెనక్కి తిరిగి చూసుకోవాలి?: జనసేనాని
- ఒక్క సీటు కూడా గెలవలేని పార్టీతో చెలిమి చేస్తామా? పవన్
- శ్రీరెడ్డిపై ఫైర్ అయిన కార్తీ... పవన్ కళ్యాణ్ మాటే...
- రేణూ దేశాయ్ బాటలో సునీత.. రెండో పెళ్లి చేసుకుంటారా? ఎఫ్బీలో ఏమన్నారు?
- శ్రీనివాస కళ్యాణం కాన్సెప్ట్ టీజర్‌ను ఓ లుక్కేయండి (video)
వామ్మో.. ముంబైలో అతిపెద్ద నాగుపాము... 5.5 అడుగుల పొడవు..
అతిపెద్ద నాగుపాము ముంబైలో కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. కల్యాణ్ ప్రాంతంలోని గోద్రేజ్ హిల్ పరిసరాల్లో ఉన్న శనీశ్వరుడి మందిరం వెనకాల శనివారం జూలై-21 పొడువైన తాచు పాము కలకలం సృష్టించింది. ప
అతిపెద్ద నాగుపాము ముంబైలో కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. కల్యాణ్ ప్రాంతంలోని గోద్రేజ్ హిల్ పరిసరాల్లో ఉన్న శనీశ్వరుడి మందిరం వెనకాల శనివారం జూలై-21 పొడువైన తాచు పాము కలకలం సృష్టించింది. ప్రతి శనివారం ఈ ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఉదయం పూట భక్తులు మందిరం చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండగా నాగుపామును చూసి భయాందోళనకు గురయ్యారు.
వారి అరుపులతో పాము మందిరంలోని గార్డెన్‌లోకి చొరబడింది. సాక్షాత్తు భగవంతుడే కనిపించాడంటూ కొంతమంది భక్తులు పూజలు, భజనలు చేశారు. కేతన్ పాటిల్ అనే యువకుడు సర్పమిత్ర దత్తా బెంబేకు సమాచారమివ్వడంతో ఆయన వచ్చి పామును పట్టుకుని సంచిలో బంధించారు.
5.5 అడుగుల పొడవున్న ఈ పాము భారతీయ జాతికి చెందినదిగా గుర్తించారు. తాచు పామును అటవీ ప్రాంతంలో విడిచిపెట్టనున్నట్లు దత్తా తెలిపారు. అయితే పాము మందిరంలో ఎప్పటినుంచో ఉన్నట్లు శబ్దాలు వచ్చేవని.. ఇప్పటివరకు ఎవ్వరికీ హానీ చేయలేదని పూజారులు అంటున్నారు.
