గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 28 మార్చి 2018 (09:04 IST)

కాలేజీ అమ్మాయిలతో వ్యభిచారం... ఎక్కడ?

దేశంలోని అనేక పర్యాటక ప్రాంతాల్లో వ్యభిచార కేంద్రాలు గుట్టుచప్పుడుకాకుండా జరుగుతుంటాయి. అయితే, ఆగ్రా వంటి ప్రముఖ పర్యాటక కేంద్రంలో కూడా ఈ తరహా సెక్స్ రాకెట్ జరుగుతోంది. అదీకూడా కాలేజీ అమ్మాయిలతో కలిసి

దేశంలోని అనేక పర్యాటక ప్రాంతాల్లో వ్యభిచార కేంద్రాలు గుట్టుచప్పుడుకాకుండా జరుగుతుంటాయి. అయితే, ఆగ్రా వంటి ప్రముఖ పర్యాటక కేంద్రంలో కూడా ఈ తరహా సెక్స్ రాకెట్ జరుగుతోంది. అదీకూడా కాలేజీ అమ్మాయిలతో కలిసి ఈ వ్యభిచార గుట్టును కొనసాగించడం గమనార్హం. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఆగ్రా నగరంలోని ఓ హోటల్‌లో గుట్టుగా వ్యభిచారం సాగుతుందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆగ్రా ఏఎస్పీ రవీనా త్యాగి కొందరు పోలీసులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేసి హోటల్‌లో ఆకస్మికంగా దాడులు చేశారు. పలువురు అమ్మాయిలతోపాటు ఐదుగురు విటులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా స్థానికంగా ఉండే ఓ ప్రముఖ కాలేజీకి చెందిన విద్యార్థినిలుగా గుర్తించారు. 
 
ఢిల్లీకి చెందిన ఇద్దరు అమ్మాయిలు కూడా పోలీసులకు చిక్కారు. వీరిని వైద్యపరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. అమ్మాయిలు ఏడురోజులపాటు వ్యభిచారం సాగించేందుకు రూ.20 వేల కాంట్రాక్టుపై వచ్చారని పోలీసుల దర్యాప్తులో తేలింది. హోటల్ యజమానురాలైన వితంతువు తన కుమారుడు, కుమార్తెతో కలిసి సెక్స్ రాకెట్ నిర్వహిస్తుందని వెల్లడైంది.