సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 11 జూన్ 2024 (13:27 IST)

కన్నడ నటుడు దర్శన్ అరెస్ట్- రేణుకా స్వామి హత్య

murder
కన్నడ నటుడు దర్శన్ అరెస్ట్ అయ్యాడు. నటి పవిత్ర గౌడకు చెందిన అభ్యంతరకరమైన సందేశాలు పంపినందుకు రేణుకా స్వామిని కొందరు హత్య చేశారు. నటుడు దర్శన్ సూచనల మేరకు ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. కన్నడ ఇండస్ట్రీలో ఈ హత్య పెద్ద దుమారాన్నే రేపింది. హత్యకు కారణమైన నటుడు దర్శన్‌ని మైసూర్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో పోలీసులు అరెస్టు  చేశారు. దర్శన్‌తో పవిత్ర గౌడ సన్నిహితంగా ఉంటుంది. 
 
ఈ ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అని కన్నడ ఇండస్ట్రీలో చాలా వార్తలు షికారు చేశాయి. ఈ నేపథ్యంలో పవిత్ర గౌడకు రేణుక స్వామి అనే వ్యక్తి అభ్యంతకర మెసేజ్‌లు పంపి పవిత్రను భయపెట్టడం లాంటిది చేసాడని తెలుస్తోంది. 
 
బెంగుళూరులోని కామాక్షిపాలయలో రేణుకాస్వామి హత్య చేశారు. దర్శన్ సూచన మేరకే హత్య చేసినట్లు నలుగురు నిందితులు అంగీకరించారు. ఈ కేసులో దర్శన్ సహా 10 మందిని అరెస్టు చేశారు పోలీసులు. ఈ ఘటన జూన్ 9న జరిగింది.