భారత్‌లో ట్రంప్ పర్యటన-ఢిల్లీలోఆందోళనలు- కానిస్టేబుల్ మృతి (video)
Delhi
గోకుల్ పురిలో ఆందోళనకారులు జరిపిన రాళ్ళ దాడిలో గాయపడి మృతి చెందిన ఇతడిని రతన్ లాల్ అనే హెడ్ కానిస్టేబుల్ గా గుర్తించారు. ఆందోళనకారులు పలు వాహనాలకు, షాపులు, ఇళ్లకు నిప్పు అంటించడంతో వీరిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేసి.. బాష్పవాయువు ప్రయోగించారు.
జఫ్రాబాద్-మౌజ్ పూర్ రోడ్డులో ఒక యువకుడు పోలీసులపై నాటు తుపాకీతో 8 రౌండ్ల కాల్పులు జరిపాడు. అతి కష్టం మీద పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రాంతంలోనే నిన్న రాత్రి కూడా అల్లర్లు జరిగాయి. చాంద్ బాగ్ అనే ఏరియాలో జరిగిన హింసాకాండలో.. ఆందోళనకారులు విధ్వంసానికి దిగారు.

