కన్నతల్లి కంట్లో కారం కొట్టి.. గ్రైండర్ రాయితో హతమార్చిన కూతురు.. వాలెంటైన్స్ డే రోజున?

couple-valentines day
సెల్వి| Last Updated: ఆదివారం, 16 ఫిబ్రవరి 2020 (17:30 IST)
దేశ రాజధాని నగరం ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమికుల రోజును పురస్కరించుకుని ఓ తల్లిని కుమార్తె హత్య చేసింది. అదీ ప్రేమికుడిలో కలిసి కన్నతల్లి కంట్లో కారం కొట్టి హత్య చేసింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఢిల్లీ పోలీసు శాఖలో పనిచేస్తున్న ఓ మహిళా పోలీస్ అధికారికే ఈ ఘోరం జరిగింది. ఈమెకు పదో తరగతి చదువుతున్న కుమార్తె వుంది.

ఈమెకు పక్కింట్లో వున్న జితేంద్ర (19) అనే వ్యక్తితో ప్రేమ చిగురించింది. తన కుమార్తె ప్రేమాయణం గురించి తెలుసుకున్న మహిళా పోలీస్ అధికారి కూతురిని మందలించింది. ఇంకా ఆమెను కొట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఆవేశానికి గురైన పదో తరగతి బాలిక.. ప్రేమికుడితో కలిసి.. కన్నతల్లినే చంపేసింది. కన్నతల్లి ముఖంపై కారం కొట్టి.. ఆపై ప్రేమికుడితో కలిసి.. గ్రైండర్ రాయితో కొట్టి హతమార్చింది.

ఈ ఘటనపై మహిళా పోలీసు అధికారి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విచారణలో జితేంద్ర, పదో తరగతి బాలికనే నిందితులని తేలడంతో వారిని అరెస్ట్ చేశారు.దీనిపై మరింత చదవండి :