గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 16 ఫిబ్రవరి 2020 (16:19 IST)

చదువుకున్న విద్యార్థులపై పోలీసుల దాడి.. సీసీటీవీ పుటేజీతో బాగోతం బయటపడింది..

Police
సీసీటీవీ పుటేజీలో పోలీసుల అకృత్యం బయటపెట్టింది. జామియా మిలియా ఇస్లామియా స్టూడెంట్స్‌పై పోలీసులు దాడి చేసినట్లు తాజాగా వీడియోలు లీక్ అయ్యాయి. వివరాల్లోకి వెళితే.. డిసెంబర్ 15న జరిగిన ఈ ఘటనలో ఓల్డ్ రీడింగ్ హాల్‌లో చదువుకుంటున్న విద్యార్థులపై పోలీసులు లాఠీ చేశారు. ఢిల్లీ పోలీసులు హాల్‌లోకి ఎంటరై నేరుగా విద్యార్థులపై దాడి చేశారు. 
 
కామ్‌గా పుస్తకాలు చదువుకుంటున్న విద్యార్థులను లాఠీలతో కొట్టడంతో పాటు ప్రాపర్టీస్‌లో కూడా ధ్వంసం చేశారు.  చదువుకునే వాళ్లు అక్కడి నుంచి వెళ్లేంత వరకూ దాడి చేశారు. సీసీటీవీ ఫుటేజి ద్వారా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పరీక్ష కోసం ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్‌పై ఎలా దాడి చేశారో చూడండి అంటూ జేసీసీ స్టేట్‌మెంట్ విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తయారుచేస్తున్న టెర్రరిస్టులు వీళ్లని ఫైర్ అయ్యారు. ఈ వీడియోపై ఢిల్లీ పోలీసులు స్పందిస్తూ.. 
 
ఈ వీడియోపై ఢిల్లీ పోలీసులు మాట్లాడుతూ.. ఈ కేసు ఆల్రెడీ క్రైమ్ బ్రాంచ్‌కు ట్రాన్సఫర్ అయింది. వీడియో సాక్ష్యం ఆధారంగా దర్యాప్తు చేపడుతున్నారని చెప్పుకొచ్చారు. డిసెంబరు 15న జామియా యూనివర్సిటీ అల్లర్లతో పోలీసులపై రాళ్లు విసురుకుంటూ, పబ్లిక్ బస్సులు, ప్రైవేట్ వాహనాలు ధ్వంసం చేసుకుంటూ యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. 
 
ఈ వీడియోపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ పోస్టు చేస్తూ.. ఢిల్లీ పోలీసులు విచక్షణ లేకుండా చదువుకుంటున్న విద్యార్థులపై ఎలా దాడి చేశారో చూడండి. ఓ స్టూడెంట్ పుస్తకాన్ని చూపిస్తుంటే అతడి లాఠీలో కొట్టడం ఎంతవరకు సమంజసమని తెలిపాడు.