మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 16 డిశెంబరు 2019 (14:29 IST)

మమ్మల్ని బాత్రూంలోకి చొరబడి కొట్టారంటూ విద్యార్థునుల ఆరోపణ

పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని జామియా యూనివర్సిటీ విద్యార్థులు పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఎదుట నిరసనకు దిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆందోళనలు హింసకు దారితీసి.. పలు బస్సుల్ని తగలబెట్టిన ఘటనలు చోటుచేసుకున్నాయి.

ఆపై పోలీసులు వర్సిటీలోకి చొరబడి పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. కాగా అమ్మాయిలు అని కూడా చూడకుండా బాత్రూంల లోనికి చొరబడి తమను కొట్టారంటూ విద్యార్థునులు ఆరోపిస్తున్నారు. మరోవైపు బస్సులను తగలబెట్టింది విద్యార్థులేనంటూ ఆరోపిస్తున్నారు. దీనిపై న్యాయస్థానం ఎలా స్పందిస్తుందనేది చర్చనీయాంశమైంది. 
 
అయితే ఢిల్లీలోని జామియా యూనివర్సిటీలో అల్లర్లపై దాఖలైన అత్యవసర పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు నిరాకరించింది. న్యాయవాదులు ఇందిరా జైసింగ్, కొలిన్ గొన్‌సాల్వెస్ టాప్ కోర్టు జడ్జిలను వర్సిటీకి పంపించి విచారణ జరిపించాలని కోరగా.. దీనిపై రేపు విచారణ చేపడుతామని స్పష్టం చేసింది. ఇది శాంతిభద్రతలకు సంబంధించిన సమస్య అని, వర్సిటీలో ముందు శాంతియుత వాతావరణం నెలకొనాలని పేర్కొంది.  
 
శాంతియుత నిరసనలకు తాము వ్యతిరేకం కాదని తెలిపింది. 'మొదట అల్లర్లకు ఫుల్ స్టాప్ పడాలి. అల్లర్లు ఎలా చెలరేగుతాయో మాకు బాగా తెలుసు. ఇలాంటి వాతావరణంలో ఈ పిటిషన్‌పై విచారణ జరపలేం. ముందు అల్లర్లను ఆపండి.' అని ధర్మాసనం స్పష్టం చేసింది.