చీరకు నిప్పంటుకుంటే.. ఆ మహిళ ఏం చేసిందో తెలుసా?
భారతదేశం సంస్కృతికి మారుపేరు. మహిళలకు కట్టుబొట్టు ఎంతముఖ్యమో.. అంతకంటే ఎక్కువగా తమ శీలాన్ని కాపాడుకుంటారు. ప్రస్తుతం మనదేశంలో పాశ్చాత్య పోకడలు వచ్చి చేరాయి.
అంతేగాకుండా వస్త్రాధరణ మారింది. కట్టుబొట్టులోనూ ఫ్యాషన్ కనిపిస్తోంది. సోషల్ మీడియా ప్రభావంతో మనదేశ మహిళలు సంస్కృతిని మెల్ల మెల్లగా విస్మరిస్తున్నారని చాలామంది భావిస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో భారత మహిళలు శీలానికి ఎంత మర్యాద ఇస్తారనేందుకు తాజా ఘటన నిదర్శనం. తాజాగా హుబ్బళ్లి విశ్వనాథ ఆలయంలో పూజ చేసే సమయంలో ఓ మహిళ చీరకు నిప్పు అంటుకుంది.
దీంతో.. ఆ పరిస్థితుల్లోనూ తనని నగ్నంగా ఎవరూ చూడొద్దని అక్కడే ఓ గదిలోకి వెళ్లిపోయింది. ఇది చూసిన స్థానికులు లోపలికి వెళ్లి మంటలార్పారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమె పేరు ఛాయగా గుర్తించారు. ప్రస్తుతం కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.