మంగళవారం, 23 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 19 జూన్ 2019 (12:50 IST)

ఛీ.. మెట్రో రైలులో అమ్మాయిల ముందు ఏంటీ పని?

మెట్రో రైలే కాదు.. మహిళలపై ఎక్కడపడితే అక్కడ వేధింపులు జరుగుతూనే వున్నాయి. అదీ దేశ రాజధాని నగరం ఢిల్లీ మెట్రో రైలులో చీదరించుకునే ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణించిన ఓ యువతిని చూసిన ఓ యువకుడు హస్తప్రయోగం చేయడం మొదలెట్టాడు. ఈ ఘటనపై బాధిత యువతి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. 
 
తాను ఎస్కలేటర్ నుంచి బయటకు వచ్చానని.. అప్పుడు ఏదో తప్పు జరుగుతుందని తనకు తోచిందని.. వెంటనే తిరిగి చూసి షాకయ్యానని యువతి వాపోయింది. తనను చూస్తూ ఓ యువకుడు హస్త ప్రయోగం చేస్తున్నాడని.. వెంటనే చెంప ఛెల్లుమనిపించానని చెప్పింది. అయితే వెంటనే ఆ యువకుడు తనను తిట్టడం మొదలెట్టాడు. 
 
అతనితో వాగ్వివాదం చేస్తుంటే ప్రయాణీకులు ఎవ్వరూ సాయం చేసేందుకు ముందుకు రాలేదని యువతి వాపోయింది. ఇలాంటి ఘటనలు చూసేటప్పుడు మెట్రో రైలులో మహిళలకు కావాల్సింది.. ఉచిత ప్రయాణం కాదని.. భద్రతతో కూడిన ప్రయాణం అంటూ డిమాండ్ చేసింది. 
 
ఇందుకు ప్రభుత్వం భరోసా ఇవ్వాలని తెలిపింది. అంతేగాకుండా తన ట్వీట్‌ను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ట్యాగ్ చేసింది. కాగా మెట్రో రైలులో మహిళలకు భద్రతను పెంచాలని ప్రయాణీకులు డిమాండ్ చేస్తున్నారు.