శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 17 జూన్ 2019 (20:35 IST)

గుండు ఏనుగు అని పిలిచావ్ కదా... విడాకులు ఇచ్చెయ్... ఢిల్లీ హైకోర్టు

కట్టుకున్న భర్త ఫ్యాట్ ఎలిఫెంట్ (గుండు ఏనుగు) అన్నావుగా.. ఈ ఒక్క కారణం చాలు విడాకులు ఇచ్చేందుకు అంటూ ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి తన భార్యను శారీరకంగా సుఖపెట్టలేక పోయాడు. దీనికి కారణం అధిక బరువు. దీంతో భర్తను ఫ్యాట్ ఎలిఫెంట్ అంటూ పిలుస్తూ హేళన చేస్తుండటంతో భార్య నుంచి విడాకులు ఇప్పించాలని కోరుతూ ఆయన కోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరిపిన ఫ్యామిలీ కోర్టు గత 2012లో విడాకులు మంజూరు చేసింది. కుటుంబ కోర్టు ఇచ్చిన తీర్పును భార్య హైకోర్టులో సవాల్ చేసింది. 
 
దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ విపిన్ సంఘీ... భర్త ఊబకాయంతో బాధపడుతున్నప్పటికీ... అతనికంటూ ఆత్మగౌరవం ఉందని, అందువల్ల ఏనుగు, గుండు ఏనుగు వంటి పేర్లు వాడటం అవహేళన చేసినట్టేనని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో మహిళ తరపు న్యాయవాది చేసిన ఆరోపణలను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. అదేసమయంలో తనపైనా, తన కుటుంబ సభ్యులపైన వరకట్న వేధింపుల కేసును పెడతామని బెదిరిస్తున్నారని జడ్జి దృష్టికి బాధితుడు తీసుకొచ్చారు. 
 
అంతేకాకుండా, గత 2005, ఫిబ్రవరి 11వ తేదీన శారీరకంగా కలిసివున్న సమయంలో ఆమె ప్రవర్తించిన తీరుకు తన ప్రైవేట్ భాగం కూడా దెబ్బతిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చాడనీ, ఇలాంటి చర్యలు సహించరానివనీ, అందువల్ల విడాకులు ఇవ్వడానికి ఇంతకంటే కారణాలు అక్కర్లేదని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది.