గురువారం, 2 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 19 ఫిబ్రవరి 2020 (09:13 IST)

శ్రీరెడ్డిపై పోలీస్ కేసు... మా ఫస్ట్ నైట్ అక్కడే జరిగింది... అమ్మేస్తారా?

సామాజిక మాధ్యమం వేదికగా తనపై శ్రీరెడ్డి అసభ్యకర వ్యాఖ్యలు చేసిందని ఆరోపిస్తూ కరాటే కల్యాణి హైదరాబాద్ లోని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డిపై చర్యలు చేపట్టాలని ఆ ఫిర్యాదులో ఆమె కోరినట్టు సమాచారం.
 
కానీ గతంలో కరాటే కల్యాణిపై శ్రీరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఓ న్యూస్ ఛానెల్ ఇంటర్వ్యూలో తనపై కల్యాణి అనుచిత వ్యాఖ్యలు చేసిందని నాడు తన ఫిర్యాదులో శ్రీరెడ్డి ఆరోపించింది. అయితే ప్రస్తుతం కరాటే కళ్యాణి పోలీసులకు శ్రీరెడ్డిపై ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. 
 
మరోవైపు శ్రీరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచింది. సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన శ్రీ రెడ్డి గత కొంత కాలంగా సైలెంట్ గా ఉంది. మకాం మార్చి చెన్నై చెక్కేసిన ఛాన్స్ దొరికినప్పుడల్లా నోటికి పని చెప్తుంది. ఇటీవల కరాటే కళ్యాణి , డ్యాన్స్ మాస్టర్ రాకేష్ పైన బూతుల దండకం చదివిన శ్రీ రెడ్డి. తాజాగా మరో వివాదాన్ని రేపింది.
 
ప్రముఖ నిర్మాత సురేష్ బాబు హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడాలోని రామానాయుడు స్టూడియోను అమ్మేయాలని అనుకుంటున్నట్లు వస్తున్న వార్తలపై శ్రీ రెడ్డి స్పందించింది. "ఎక్కడైతే నాకు అభిరామ్‌కు ఫస్ట్ నైట్ అయ్యిందో ఆ రామానాయుడు స్టూడియో త్వరలో కనుమరుగు అవ్వనుంది" అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ పై నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు.