1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Shahabuddin’s AIIMS visit for treatment inconveniences others

డబ్బు, పలుకుబడి ఉంటే చాలు.. పోలీసులు రాచమర్యాదులు చేస్తారు... మాజీ ఎంపీకి?

డబ్బు, పలుకుబడి ఉంటే చాలు. ప్రస్తుత సమాజంలో ఏదైనా చేయవచ్చు. ఇది జైలు ఖైదీలకు బాగా వర్తిస్తుంది. సాధారణంగా ఖైదీల కంటే.. రాజకీయ నాయకులుగా ఉండి జైలులోకి వచ్చే ఖైదీలకు రాచమర్యాదలు తప్పవు.

Shahabuddin’s AIIMS visit for treatment inconveniences others
డబ్బు, పలుకుబడి ఉంటే చాలు. ప్రస్తుత సమాజంలో ఏదైనా చేయవచ్చు. ఇది జైలు ఖైదీలకు బాగా వర్తిస్తుంది. సాధారణంగా ఖైదీల కంటే.. రాజకీయ నాయకులుగా ఉండి జైలులోకి వచ్చే ఖైదీలకు రాచమర్యాదలు తప్పవు. ఇంతకీ అసలు సంగతి ఏంటంటే... నేరగాడి నుండి రాజకీయనాయకుడిగా, ఆ పై ప్రజాప్రతినిధిగా మారి.. ఆ తరువాత చేసిన నేరాలు రుజువు కావడంతో జీవితకాలం జైలు శిక్షను అనుభవిస్తున్న రాష్ట్రీయ జనతాదళ్ మాజీ ఎంపీ మహమ్మద్ షహబుద్ధీన్‌కు సేవలందించేందుకు పోలీసులు పోటీపడ్డారు.
 
అనారోగ్యంతో ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థలో చేరిన షహబుద్ధీన్‌కు వీవీఐపీ రాచమర్యాదలు చేసారు. సాధారణంగా ఎటువంటి పలుకుబడి లేని నేరగాళ్లను సాదాసీదా పోలీస్ వాహనంలో తరలించే పోలీసులు.. షహబుద్ధీన్‌కు మాత్రం ప్రత్యేకంగా ఒక ప్రైవేట్ వాహనాన్ని ఏర్పాటుచేశారు. అంతేకాదు, ఆ కారుకు ముందూ వెనక పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాట్లు కూడా చేసిన తీరు విమర్శలకు దారితీసింది. 
 
ఖైదీకి పోలీసులు ఇలా రాచమర్యాదలు చేయడం ప్రస్తుతం నేషనల్ మీడియాలో బ్రేకింగ్ న్యూస్‌గా మారిపోయింది. ఖైదీల పట్ల పోలీసుల తీరుపై నెట్టింట్లో కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తర్వాతి కథనం
ఇళ్లు కట్టడం, పెళ్లి చేయడం ఇష్టం లేక కన్నకూతురిపై రేప్ చేశాడంట.. మౌనిక కేసు నిందితుడి కొత్త కథ!