1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Terribly Afraid Over What PM Modi Will Do Next, Says Sharad Pawar

నరేంద్ర మోడీని చూస్తుంటే వెన్నులో వణుకు పుడుతోంది : శరద్ పవార్

Sharad Pawar
నా చిటికెన వేలు పట్టుకుని రాజకీయాల్లో ఎదిగానని చెబుతున్న ప్రధాని నరేంద్ర మోడీని చూస్తుంటే తనకు వెన్నులో వణుకు పడుతోందని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. మోడీని చూస్తుంటే తన వెన్నులో వణుకు పుడుతోందని, భయంతో కంపించిపోతున్నానని చెప్పుకొచ్చారు. 
 
తన వేలు పట్టుకుని రాజకీయాల్లో ఎదిగానని మోడీ చెప్పారని, కానీ ఇప్పుడు అదే మోడీని చూస్తుంటే తనకు భయం వేస్తోందన్నారు. మోడీ కనుక మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో ఏమోనని, ఈ విషయం ఎవరికీ అర్థం కావడం లేదని శరద్ పవర్ వ్యాఖ్యానించారు. 
 
గత యూపీఏ ప్రభుత్వంలో సీనియర్ మంత్రిగా ఉన్న శరద్ పవార్... గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న తనకు ప్రతి విషయంలో సహకరించేవారని 2016లో పూణెలో జరిగిన ఓ కార్యక్రమంలో నరేంద్ర మోడీ చెప్పారు. దీన్ని గుర్తు చేసిన శరద్ పవార్... ఇపుడు మోడీని చూస్తుంటే ఇప్పుడు తనకు భయం వేస్తోందంటూ పవార్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
 
శరద్ కుమార్తె సుప్రియా సూలే మహారాష్ట్రలోని బారామతి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆమెకు మద్దతుగా శనివారం దాంద్‌లో నిర్వహించిన సభలో పాల్గొన్న పవార్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు మోడీ ఏడు సభల్లో ప్రసంగించారని, ప్రతి సభలోనూ తనపైనే విమర్శనాస్త్రాలు సంధించారని పవార్ వాపోయారు. 
తర్వాతి కథనం
తెలంగాణ స్థానికంలో జనసేన పార్టీ : పవన్ కళ్యాణ్ పోటీ