శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By
Last Updated : ఆదివారం, 21 ఏప్రియల్ 2019 (10:26 IST)

తెలంగాణ స్థానికంలో జనసేన పార్టీ : పవన్ కళ్యాణ్ పోటీ

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం నోటిఫికేషన్‌ విడుదలైంది. మే నెలలో మూడు విడతల్లో పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల్లో అభిమానుల కోరిక మేరకు జనసేన పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. 
 
తెలంగాణలో పోటీ చేయాలని ఇప్పటికే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఆయన కార్యకర్తలు, అభిమానులు విజ్ఞప్తి చేయగా.. జనసేన తెలంగాణ ఇన్‌చార్జ్ శంకర్ గౌడ్, ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి, పార్టీ అధ్యక్షుడి రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ ఇదే విషయమై చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీపై కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకున్న అనంతరం.. దీనిపై నిర్ణయం తీసుకుని ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించారు. 
 
కాగా, తెలంగాణ వ్యాప్తంగా 538 జెడ్పీటీసీ, 5817 ఎంపీటీసీలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదలైంది. మూడు విడతల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించబోతున్నారు. తొలి విడత ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ 22న విడుదలై మే 6న ఎన్నికల పోలింగ్ జరగనుంది. రెండవ విడత ఎన్నికల నోటిఫికేషన్‌ ఏప్రిల్‌ 26న పోలిగ్ మే 10న, మూడవ విడత ఎన్నికల నోటిఫికేషన్‌ ఏప్రిల్‌ 30న విడుదల కానుండగా మే 14న పోలింగ్‌ నిర్వహించనున్నారు.