స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే బీజేపీ 40 సీట్లు రావు : మోడీ మాజీ సన్నిహితుడు
దేశంలో పారదర్శకంగా, స్వేచ్ఛగా ఎన్నికలు జరిగినట్టయితే భారతీయ జనతా పార్టీకి 40 సీట్లు రావని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాజీ సహచరుడు అజయ్ అగర్వాల్ వ్యాఖ్యానిచారు. గుజరాత్‌లో పోటీ చేసేందుకు అజయ్‌కు బీజేపీ టిక్కెట్ నిరాకరించింది. దీంతో ప్రధాని మోడీకి అజయ్ ఓ లేఖ రాశారు. ఇందులో అన్ని విషయాలను ప్రస్తావించారు.
లోక్‌సభ ఎన్నికలు స్వేచ్ఛగా జరిగితే బీజేపీకి 40 సీట్లు కూడా రావని ప్రధాని నరేంద్ర మోడీ ఒకప్పటి సన్నిహితుడు, సుప్రీంకోర్టు న్యాయవాది అజయ్ అగ్రవాల్ వ్యాఖ్యానించారు. ఆయన 2014లో రాయ్‌బరేలీలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ మీద బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.
డిసెంబరు 6న గుజరాత్ ఎన్నికలు జరుగుతుండగా, మణిశంకర్ అయ్యర్ నివాసంలో పాకిస్థాన్ అధికారులతో మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సమావేశమైన విషయాన్ని తాను వెల్లడించానని అజయ్ అగ్రవాల్ చెప్పారు. ఈ సమావేశాన్ని దేశ భద్రతకు ముడిపెడుతూ నరేంద్ర మోడీ గుజరాత్ ఎన్నికల్లో విస్తృత ప్రచారం చేశారని తెలిపారు.
నాడు తాను అందించిన సమాచారంతోనే గుజరాత్‌లో బీజేపీ ఓటమి అంచుల్లోంచి బయటపడిందని వ్యాఖ్యానించారు. గుజరాత్ విజయంలో తన పాత్రను స్వయంగా సంఘ్ నేత దత్తాత్రేయ హసబోలే గుర్తించారని చెప్పారు. హసబోలేతో తన సంభాషణల ఆడియోను అజయ్ అగ్రవాల్ విడుదల చేశారు. స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే బీజేపీకి 40 సీట్లు కూడా రావని మోడీకి రాసిన లేఖలో అజయ్ అగర్వాల్ వ్యాఖ్యానించారు.