గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్ సభ ఎన్నికలు 2019 వార్తలు
Written By జె
Last Modified: సోమవారం, 15 ఏప్రియల్ 2019 (17:29 IST)

జయప్రద గుట్టు విప్పుతా... అజంఖాన్ సంచలన వ్యాఖ్యలు

ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో దిగజారుడు ఆరోపణలు కనిపిస్తున్నాయి. సినీనటి, బిజెపి అభ్యర్థి జయప్రదపై సమాజ్ వాదీ పార్టీ నేత అజంఖాన్ అసభ్యకర వ్యాఖ్యలు చేయడం పెద్ద దుమారాన్నే రేపుతోంది. రాంపూర్ ఎన్నికల ప్రచారంలో దిగజారి మాట్లాడారు అజంఖాన్. జయప్రద అసలు రూపాన్ని కనిపెట్టేందుకు మీకు 15 యేళ్ళు పడితే తనకు 15 రోజులు పట్టిందని తిట్టిపోశారు.
 
అజంఖాన్ విమర్సలపై జయప్రద మండిపడ్డారు. సోదరుడిగా భావిస్తే ఆయన ఇంతకు దిగజారాడని ఇక ఎంతమాత్రం ఉపేక్షించనని వార్నింగ్ ఇచ్చారు. ఈ స్థాయిలో తిట్ల పురాణం యుపి ఎన్నికల్లో గతంలో లేవు. అయితే అనూహ్యంగా జయప్రద తెరపైకి రావడంతో ఆ ప్రాంతంలో పోటీ చేస్తున్న సమాజ్ వాదీ పార్టీ నేతల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి.
 
జయప్రదకు ఉన్న చరిష్మాను తగ్గించాలంటే ఎలాగైనా ఆమెపైన తీవ్ర ఆరోపణలు చేయాలని భావించారు అజంఖాన్. జయప్రద గుట్టు మొత్తం తనకు తెలుసునని, ఆ గుట్టు మొత్తం విప్పుతానన్నారు. ఇప్పటికే సినీనటిగా జయప్రద గురించి అందరికీ తెలుసునని, ఆమె క్యారెక్టర్ ఎలాంటిదో కూడా ప్రజలకు తెలుసునని, దాన్నే తాను చూపించే ప్రయత్నం చేస్తానన్నారు. అజంఖాన్ వ్యాఖ్యలు కాస్త తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి.